Ram gopal varma movie with jagan story

Ram Gopal Varma, ys jagan, manchu vishnu, vishnu manchu in RGV direction, ram gopal varma withvishnu, ys family story, faction movie

ram gopal varma manchu vishnu movie with jagan story.

విష్ణుతో కలిసి జగన్ ని టార్గెట్ చేసిన వర్మ

Posted: 12/16/2013 11:06 AM IST
Ram gopal varma movie with jagan story

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియాల్టీ స్టోరీలనే ఆధారంగా తీసుకొని ఫ్యాక్షన్ సినిమాలు తీసి ఎన్నో వివాదాలకు కారణం అవుతుంటాడు. సినిమా మొదలు పెట్టినప్పటి నుండే కాంట్రవర్సీలతో కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకునే వర్మ ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు.

ఇటీవలే ప్రారంభం అయిన ఈ సినిమా గురించి టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తుంది. ఈ సినిమా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి లను ఆధారంగా చేసుకొని తీస్తున్నాడని అంటున్నారు. ఈ వాదన వినిపించడానికి కూడా ఓ కారణం ఉంది. మోహన్‌బాబు ఫ్యామిలీకి మామూలుగానే జగన్ ఫ్యామిలీతో బంధుత్వం వుంది. దానిని ఆధారంగా చేసుకొని ఈ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

దీనికి జగన్ నుండి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో మరింత బలం చేకూరుతున్నాయి. ఈ సినిమా లో ఆయనను హైలైట్ చేసి, ఎన్నికలకు ముందు మరింత పబ్లిసిటీ తీసుకురావాలనే ప్లాన్ లో భాగంగానే రామ్‌గోపాల్‌వర్మ వీరి కథను ఎంచుకున్నాడని అంటున్నారు.

ఎప్పుడు కాంట్రావర్శీలను కోరుకునే వర్మ ఈ సినిమాలో జగన్ ఫ్యామిలీ ఫ్యాక్షన్ రాజకీయాలను చూపిస్తాడో ? లేక అవినీతితో వేలకోట్లు సంపాదించడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఎలా ఎదిగాడో అనే విషయాన్ని చూపిస్తాడో ? కానీ జగన్ పై సినిమా అనగానే సినీ జనాల్లో ఒక రకమైన ఉఠ్కంట నెలకొంది. ఇటీవల కాలంలో ఒక్క హిట్టు కూడా నమోదు చేయలేదు. ఇలాంటి టైంలో ఈ సినిమానైనా వర్మకు హిట్టిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles