Actress samantha own voice for coming movies

Actress Samantha Own Voice For Coming Movies, Chinmayi was dubbing for Samantha, Samantha own dubbing, actress samantha

Actress Samantha Own Voice For Coming Movies, Chinmayi was dubbing for Samantha, Samantha own dubbing, actress samantha

చిన్మయికి చిన్నగా హ్యాండ్ ఇచ్చింది

Posted: 11/20/2013 11:22 AM IST
Actress samantha own voice for coming movies

టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో దూసుకుపోతున్న బ్యూటీ సమంతా సొంత డబ్బా కొట్టుకుంటూ ఇన్ని రోజులు తనకు అండగా ఉన్న చిన్మయికి హ్యాండ్ ఇచ్చింది. ఏం విషయం అనుకుంటున్నారా ? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు రాని సమంతా తాను స్టార్ గా ఎదగడానికి ఎంత తక్కువ టైం పట్టిందో, అంతే ఫాస్ట్ గా తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది.

ఇటీవల ఆమె నటించిన ‘డాబర్ వాటికా ’ హెయిరాయిల్ వాణిజ్య ప్రకటనకు తానే వాయిస్ ఇచ్చుకుంది. ఈ వాయిస్ గతంలో తనకు డబ్బింగ్ చెబుతున్న చిన్మయికి సరిగ్గా సరిపోవడంతో ఇక నుండి సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ఉవ్విళ్ళూరుతుంది . గతంలో నుండి చిన్మయి వాయిస్ కి అలవాటు అయిన ఈ అమ్మడు ఆమె అభిమానుల్ని హర్డ్ చేయడం ఇష్టం లేక, తాను డబ్బింగ్ చెప్పుకోవడం లేదని చెప్పింది.

కానీ ఇప్పుడు యాడ్ కి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చూస్తుంటే శ్రీపాద చిన్మయికి హ్యాండ్ ఇచ్చి ఇక పై సొంత డబ్బా కొట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు సినీ జనాలు. అయితే వాయిస్ విషయంలో ఇన్నాళ్ళూ సమంతానే నమ్ముకున్న చిన్మయి ఇప్పుడు తమ ఆదాయం మాత్రం తగ్గిపోతుందని తెగ బాధ పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles