Deepika padukone pulls out of her hollywood film

Deepika Padukone, Fast and Furious 7, Hollywood, Bollywood, Hollywood films

Deepika Padukone has reportedly pulled out of her much-hyped Hollywood project, Fast & Furious 7.

దీపికా పదుకునే చేజార్చుకుంది

Posted: 09/12/2013 07:57 PM IST
Deepika padukone pulls out of her hollywood film

సినీ తారలు ఒక్కోసారి చేతికి అందివచ్చిన అవకాశాలను చేజార్జుకొని బాధ పడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో దూసుకుపోతున్న దీపికా పదుకునే కూడా ఓ మంచి అవకాశాన్ని చేజార్జుకుంది. ఇటీవలే ఆమె తొలిసారిగా హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ & ఫ్యూరియస్-7 ’లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దీపికాకు అవకాశం రావడంతో ఈ అమ్మడు పంటపండినట్లేనని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమా నుండి దీపికా తప్పుకుందని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఈ సినిమా షూటింగ్ కోసం యూఎస్ లో కొన్నాళ్ళ పాటు ఉండాలని చెప్పడంతో ఇప్పటికే కమీట్ అయిన సినిమాలకు సమస్య వచ్చి పడుతుందని భావించి ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు చెప్పిందట ఆ చిత్ర నిర్మాతలకు. యూనివర్శల్‌ పిక్చర్స్‌ అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటులైన విన్ డీజిల్, జాసన్ స్టాతం మరియు ద్వాయ్నే జాన్సన్ (ది రాక్) ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈమె తప్పుకోవడంతో మరో కథానాయికను వెతికే పనిలో పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles