Pawan kalyan vs jr ntr

Pawan Kalyan and Jr.NTR,Pavan Kalyan vs NTR.Mahesh New Films List, Pawan Kalyan New Films List, NTR News Films List

Pawan Kalyan vs Jr NTR: Power Star Film to Clash with Ramayya Vastavayya at Box Office.

పవన్ తో పోటీకి సిద్దమైన ఎన్టీఆర్

Posted: 05/08/2013 01:55 PM IST
Pawan kalyan vs jr ntr

టాలీవుడ్  టాప్ హీరోలలో పవన్ కళ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ లు. వీరి మార్కెట్ రేంజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే త్వరలో వీరిద్దరి మధ్య వార్ జరగబోతుందట. అంటే సినిమా వార్ అన్నమాట. వీరిద్దరు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు రెండు మూడు రోజుల వ్యవథిలో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే త్రివిక్రం దర్శకత్వంలో వస్తున్న పవన్ సినిమా ఆగస్టు 7న విడుదలవుతుందని ప్రకటించేశారు. ఇప్పుడు తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రం దీనికి రెండు రోజుల వ్యవధిలో ఆగష్టు 9న విడుదల చేయడానికి నిర్ణయించాడట ఆ సినిమా నిర్మాత దిల్ రాజు. దీంతో ఆగస్టులో వీరిద్దరి మద్య వార్ జరగడం ఖాయం అంటున్నారు. పవన్ సినిమా విడుదల ఉందని తెలిసినా, దిల్ రాజు ఆ వీక్ లో వచ్చే సెలవులను క్యాష్ చేసుకోవడానికే ఇంత హడావుడిగా విడుదలను ఖరారు చేశాడని అంటున్నారు. అయితే సినీ పండితులు మాత్రం అలా గనుక జరిగితే థియేటర్ల కొరత ఏర్పడటం ఖాయం అంటున్నారు. ఇక వీరిద్దరి సినిమాలు గతంలో ఓకేసారి విడుదల అయ్యి పరాజయం పాలయ్యాయి. మరి ఆ సెంటిమెంటుతోనైనా ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles