Leagel charges facing adhinayakudu movie

leagel charges facing adhinayakudu movie

leagel charges facing adhinayakudu movie

18.gif

Posted: 04/26/2012 05:40 PM IST
Leagel charges facing adhinayakudu movie

              అధినాయకుడు సినిమా ఏ మహూర్తాన ప్రారంభించారో ఏమో అన్నీ అవాంతరాలే..అడ్డంకులే.  మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా... అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న 'అధినాయకుడు' సినిమా తాజాగా మరో చిక్కుల్లో పడింది. ప్రముఖ అవుట్ డోర్ సినీ యూనిట్ సంస్థ ఆనంద్ సినీ సర్వీసెస్ ఈ సినిమా నిర్మాతపై కోర్టుకెక్కింది.
              adi_innసదరు నిర్మాత తమకు 51 లక్షలు బాకీ పడ్డారనీ, అది పూర్తిగా చెల్లించే వరకు సినిమా విడుదలను నిలుపుదల చేయాలనీ కోరుతూ ఆనంద్ సినీ సర్వీసెస్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు బయట పరిష్కారం లభించకపోవడంతో ఆ సంస్థ ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించిందని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరిందనే చెప్పచ్చు. ఇప్పటికే పలు ఇబ్బందులతో విడుదల పరంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు మరింతగా కష్టాలలో కూరుకుపోయిందని అంటున్నారు. తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా, ఇలా రకరకాల కారణాలతో విడుదలకు నోచుకోకపోవడం బాలకృష్ణకు మనస్తాపాన్ని కలిగించటమే కాదు నందమూరి అభిమానులకు ఇది కంటగింపుగా మారింది. ఇక ఈ సినిమా ఏదోరకంగా రిలీజై సూపర్ హిట్ అయితే గాని నిర్మాత కష్టాలు తీరవు. ఒకవేళ మూవీ అటు ఇటు అయితే ఇక అంతే సంగతులు.దేవుడే దిక్కు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero manchu vishnu now onwards stunt director also
King nagarjuna doing a cinima on sushanth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles