Facebook Improves Benefits For Contract Workers

Facebook boosts minimum wage for contract workers to 15 an hour

Facebook Improves Benefits For Contract Workers, Facebook raises salaries for Contract Workers, Social networking, Facebook, Sheryl Sandberg, Internet, Social media, Silicon Valley

In a significant measure that would benefit a large workforce, especially women, the social networking site Facebook is extending minimum wages and other benefits to its contract workers.

ఉద్యోగులపై ఫేస్ బుక్ వరాల జల్లు.. గంటకు రూ.1000 కనీసవేతనం..

Posted: 05/14/2015 07:03 PM IST
Facebook boosts minimum wage for contract workers to 15 an hour

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై వరాల జల్లు కురిపించింది. అటు కనీస వేతనాన్ని పెంచడంతో ఇతర సుదుపాయాలను కూడా ప్రకటించింది. వీటితో పాటు మహిళా ఉద్యోగులకు కూడా శుభవార్తను అందించింది, ఇన్నాళ్లుగా తమ సంస్థలో పనిచేస్తున్న ప్రత్యక్షంగా తమతో ఎలాంటి అటాచ్ మెంట్ లేకున్నా..ఇతర ఏజెన్సీల అనుసంధానంతో కాంట్రాక్టు ఉద్యోగులపై ఎట్టకేలకు కరుణ చూపింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్న అత్యధిక మంది కాంట్రాక్టు కార్మికులకు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు మరింత ప్రయోజం చేకూరనుంది.

తాజా నిర్ణయం ప్రకారం గంటకు సుమారు 15 డాలర్లు ( మన దేశ కరెన్సీలో ఇది సుమారుగా రూ.1000 ) కనీస వేతనం లభిస్తుంది. ఏడాదికి 15 వేతనంతో కూడిన సెలవులు కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇక ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా సుమారు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. ప్రత్యేకంగా తమ సంస్థ తరపున అమెరికాలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని ఫేస్ బుక్ వెల్లడించింది. విశాల దృక్పథంతో కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ప్రకటించామని ఫేస్ బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్‌బర్గ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు పోత్సాహకాలు ప్రకటిస్తే వారు సంతోషంగా ఉంటారని, ఫలితంగా పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. మహిళలతో పాటు పురుషులకు పెరేంటల్ లీవు ఇస్తామని ప్రకటించారు. అయితే ముందుగా సిలికాన్ వాలీలో వీటిని అమలు పర్చి ఆ తదనంతరం.. మిగతా దేశాలలో అమలుపరుస్తామని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Social networking  Facebook  Sheryl Sandberg  Internet  Social media  

Other Articles