Mukesh ambani richest indian

Mukesh Ambani, Mukesh Ambani Richest Indian, Richest Indian, Mukesh Ambani net worth, Mukesh Ambani rich list, Savitri Jindal, Savitri Jindal rich list, Savitri Jindal Hurun, Dilip Shanghvi.

Reliance Industries Chairman Mukesh Ambani is India richest man with personal assets of 18.9 billion, a report says.

ఇండియాలో ఈయనే అపరకుభేరుడు..

Posted: 10/25/2013 10:37 AM IST
Mukesh ambani richest indian

మనదేశంలో అత్యంత సంపన్నమైన భారతీయుడిగా రియలన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన హ్యూరన్ సంస్థ భారత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ముకేష్ అంబానీ ఈ ఏడాది కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయన సపంద 1,890 కోట్ల డాలర్లు ఉన్నట్లు తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈయన సంపద రెండు శాతం క్షీణించినా ఈయనకే మొదటి స్థానం దక్కడం విశేషం.

ఆయన తరువాత ఉక్కు సామ్రాట్ లక్ష్మీ మిట్టల్ 1,590 కోట్ల డాలర్లతో రెండోస్థానంలో ఉన్నారు. సంపద గత ఏడాదితో పోల్చితే 6% తగ్గింది. మూడో స్థానంలో ఉన్న సన్‌ఫార్మా వ్యవస్థాపకులు, దిలీప్ సంఘ్వి టాప్ 3లో చోటు దక్కింది. ఈయన సంపాదన గత సంవత్సరం కంటే ఈ ఏడాది 66 శాతం పెరగడంతో ఆయనకు ఈ స్థానం దక్కింది. విప్రో అజీమ్ ప్రేమ్‌జీ 1,200 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్ 860 కోట్ల డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కుమార మంగళం బిర్లా 840 కోట్ల డాలర్లతో 6వ స్థానంలో, 810 కోట్ల డాలర్లతో గోద్రెజ్ గ్రూప్ ఆది గోద్రెజ్ ఏడో స్థానంలో నిలిచారు. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌కో కె చెందిన పల్లోంజి మిస్త్రీ 800 కోట్ల డాలర్లతో ఎనిమిదో స్థానంలో, 760 కోట్ల డాలర్లతో ఎస్సార్ ఎనర్జీకి  చెందిన శశి, రవి రుయాలు 9వ స్థానంలో, 730 కోట్ల డాలర్లతో భారతీ ఎయిర్‌టెల్ సునీల్ మిట్టల్ 10వ స్థానంలో ఉన్నారు. టాప్ 10లో ఈ  ముగ్గురు ఈ ఏడాది చోటు సాధించారు.  ఓపీ జిందాల్ గ్రూప్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ సావిత్రీ జిందాల్ అత్యంత సంపన్న మహిళ(510 కోట్ల డాలర్లు)గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అను అగా, కిరణ్ మజుందార్ షా (బయోకాన్), శోభన భర్తియ స్థానం దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles