The Best Homemade Remedies For Soft Feet | Beauty Tips | Feet Remedies

Homemade remedies for soft feet beauty tips

feet remedies, feet beauty tips, feet beauty tips, feet beauty care, feet care tips, feet care remedies, feet best remedies, health tips for feet, feet health tips, feet best remedies

Homemade Remedies For Soft Feet Beauty Tips : The Best Homemade Remedies To Get Soft Feet.

సున్నితమైన పాదాలకు సింపుల్ టిప్స్

Posted: 08/07/2015 04:48 PM IST
Homemade remedies for soft feet beauty tips

స్త్రీల శరీరంలో వున్న అందమైన భాగాల్లో పాదాలు కూడా ఒకటి. అందమైన పాదాలు వున్నవారు చాలా ఆకర్షణీయంగా కనువిందు చేస్తారు. ముఖం కాంతివంతంగా వున్నప్పుడు.. పాదాలు బాగోలేకపోతే చాలా ఇబ్బందికరంగా, అసహ్యంగా వుంటుంది. అలాంటప్పుడు ముఖానికి తీసుకొనే జాగ్రత్తలు పాదాల విషయంలోనూ కొద్దిగా తీసుకుంటే మొత్తం శరీర సౌందర్యం ఇనుమడిస్తుంది. పాదాల సౌందర్యం కోసం స్పాలు, సెలూన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే రెమెడీలు తయారుచేసుకుని, వాటిని పట్టిస్తే చాలు. ఇంతకీ ఆ రెమెడీలు ఏంటో తెలుసుకుందామా..

* లెమన్-సాల్ట్ : ఒక నిమ్మకాయను తీసుకుని, దానిని సగానికి కట్ చేసి.. ఒక నిమ్మచెక్క మీద ఉప్పు చిలకరించి పాదాల మీద 10-15నిముషాల పాటు స్క్రబ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* ఆరెంజ్ పీల్ : ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, తర్వాత పౌడర్ గా చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పౌడర్లో ఒక చెంచా రోజ్ వాటర్ మిక్స్ చేసి పాదాలకు పట్టించాలి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* బేకింగ్ సోడా-షాంపు : 4 చెంచాల బేకింగ్ సోడా తీసుకొని ఒక టబ్ గోరువెచ్చని నీటిలో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమ నీటిలో పాదాలను డిప్ చేయాలి. అదే టబ్ లో కొద్దిగా షాంపును కూడా వేసి నిధానంగా రుద్ది కడగాలి.

* లెమన్-గ్లిజరిన్-రోజ్ వాటర్ : ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా గ్లిజరిన్, అరచెంచా రోజ్ వాటర్ ను మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి చేయాలి. అనంతరం సాక్సులు వేసుకొని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సాఫ్ట్ గా, పాదాల పగుళ్ళు లేకుండా మార్చుకోవచ్చు.

* మిల్క్ క్రీమ్ : మిల్క్ క్రీమ్ తీసుకొని మీ పాదాలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడానికి ముందు షాంపులో కొద్దిసేపు పాదాలను నానబెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : feet beauty tips  feet remedies  home made beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more