Murlidhar devidas amte biography famous social worker

murlidhar devidas amte biography, murlidhar devidas amte life story, murlidhar devidas amte life history, famous social workers, murlidhar devidas amte wikipedia, murlidhar devidas amte wiki telugu

murlidhar devidas amte biography famous social worker : The famous social worker muralidhar devidas amte biography who fought for tb patients.

కుష్టురోగుల పాలిట దేవుడిగా మారిన దేవిదాస్..

Posted: 02/09/2015 07:00 PM IST
Murlidhar devidas amte biography famous social worker

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, దారుణాలను అరికట్టేందుకు ఎందరో మహానుభావులు, మహిళాప్రతిభావంతులు ముందుకు వచ్చారు. వివిధ కులాలకు, తెగలకు, జాతులకు చెందిన వారిపై నిత్యం జరిగే ఆకృత్యాలకు గళం ఎత్తినవారు చాలామంది వున్నారు. అటువంటివారిలో మురళీధర్ దేవదాస్ ఆమ్టే ఒకరు. ఈయన ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధగాంచిన వ్యక్తి. ముఖ్యంగా కుష్టురోగుల పాలిట దేవుడిగా మారిన యోధుడు. ఎందుకంటే.. కుష్టిరోగ్యంగా బాధపడుతున్న వారందరికోసం ఈయన చంద్రపూర్ జిల్లాలో ఆనంద్ వన్ అనే ఆశ్రమాన్ని స్థాపించి, ఈయన కూడా వారితోపాటే జీవనం కొనసాగించేవారు. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ.. ఆ భోగభాగ్యాలను వదిలేసి బడుగుబలహీన వర్గాల ప్రజల సేవకే జీవితాంతం కృషి చేశారు. ఈయన అందించిన ఆ కృషికి.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి.

జీవిత చరిత్ర :

1914 డిసెంబర్ 26వ తేదీన మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్‌ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి ఈయన తల్లిదండ్రులు ఇతనికి బాబా అనే ముద్దుపేరు పెట్టారు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. 1946లో ఈయన సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నారు. వారికి వికాస్, ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు.

మరిన్ని విశేషాలు :

బాబా న్యాయఅభ్యాసం చేసే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. అప్పుడు ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులో వాదించేవారు. అలా క్రమక్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడయ్యారు. ఇక గాంధీజీతోపాటే సేవాగ్రం ఆశ్రమంలో గడుపుతూ.. ఆయన సిద్ధాంతాలను ఆచరించేవారు. ఈ నేపథ్యంలోనే గాంధీజీ ఆయనకు అభయసాధక్ అనే బిరుదు ఇచ్చారు. ఆయన ఈ బిరుదు ఇవ్వడానికి ఓ కారణం వుంది. అదేమిటంటే.. కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి తనవంతు కృషి చేసినందుకు దాన్ని గుర్తించి గాంధీజీ అలా బిరుదిచ్చారు.

బాబా ఆమ్టే మూడు ఆశ్రమాలను స్థాపించారు. అందులో ఆనంద్ వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించారు. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు కాబట్టి.. అటువంటివారిని చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడిపేవారు. తదనంతరం వీరికోసమే సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించారు. గాంధీజీ బ్రిటీష్ వరిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబాఆమ్టే కూడా ‘నర్మదా బచావో’ ఉద్యమంలో ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించారు.

కుష్టువ్యాధి ఒక అంటురోగమని, అటువంటివారిని తాకితే ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో.. బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు. అంతటి బలమైన ఈ వ్యక్తి.. తన ఆశ్రమం ఆనంద్ వన్’లోనే 2008, ఫిబ్రవరి 9 ఉదయం 4.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. 94 సంవత్సరాల వయస్సు ఉన్న బాబా ఆమ్టే చాలా కాలం నుంచి వెన్నుపూస సమస్యతో భాధపడేవారు. ఆ బాధ రానురాను తీవ్రమైన నేపథ్యంలో.. తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : murlidhar devidas amte  famous social workers  

Other Articles