Teacher arrested for allegedly raping six year old in bangalore school

rape, six year old raped, bangalore, bangalore private school, teacher, arrest, crime, police, bangalore police, CM, karnataka, siddaramaiah

teacher arrested for allegedly raping six year old in bangalore school

బెంగళూరులో మరో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన..

Posted: 10/31/2014 08:42 PM IST
Teacher arrested for allegedly raping six year old in bangalore school

కర్ణాటక రాజధాని బెంగళూరులోని మరో దారుణం జరిగింది. ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యార్థినిపై ఆ స్కూలు అటెండర్ అత్యాచారం జరిపిన ఘటనను మరువక ముందే మరో ఘటన వెలుగుచూసింది. ఓ స్కూల్లో ఆరేళ్ల బాలికపై ఆ పాఠశాల ఉపాద్యాయుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు. గడిచిన మూడు నెలల్లో ఈ తరహా కేసులు ఐదు చోటుచేసుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు పంపినా తమ పిల్లలు క్షేమంగా ఇళ్లకు తిరిగి వస్తారా.? అంటూ భయాందోళన చెందుతున్నారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత మంగళ, బుధ వారాల్లో రెండుసార్లు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు ఉపాధ్యాయుడు అంగీకరించాడని బెంగళూరు అదనపు పోలీసు కమిషన్ (శాంతిభద్రతలు) అలోక్ కుమార్ తెలిపారు.

స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన బాలిక తనకు బాగా నొప్పిగా ఉందని చెప్పడంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఆ వైద్యుడు చెప్పారు. దీంతో గురువారం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, కేసు నమోదు చేశామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని, దాంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఓ సర్క్యులర్ పంపామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు, అటెండర్లు సహా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామాలను చేపడుతున్నప్పడు.. పాఠశాల యాజమాన్యాలు ముందు వారి కుటుంబ నేపథ్యాన్ని, నేర ప్రవృత్తిని పరిగణలోకి తీసుకోవాలని సిద్దిరామయ్య సూచించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more