October 20 is not deadline for pension says ktr

KCR, Deadline, Pensioners, Telangana, government schemes, KTR

october 20 is not deadline for pension says KTR

అక్టోబర్ 20.. చివరి తేదీ కాదు..

Posted: 10/16/2014 09:11 PM IST
October 20 is not deadline for pension says ktr


తెలంగాణ రాష్ట్రంలో పెన్సన్లు, ఆహార భద్రతా కార్టులకు అక్టోబర్ 20 తేది డెడ్ లైన్ కాదు అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణ నిరంతర ప్రక్రియని అది అలాగే కోనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడు ఎప్పుడైనా ప్రభుత్వ సంక్షేప పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. దరఖాస్తు ఇప్పుడు ఇచ్చి, ధృవీకరణ పత్రం తర్వాత ఇచ్చినా ఫర్వాలేదని కేటీఆర్ వివరించారు.

లబ్దిదారులకు పథకాల సమాచారాన్ని అందించేందుకు కలెక్టర్లు, అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే సంతృప్తికరమైన పద్దతిలోనే ప్రభుత్వ పథకాల అమలు జరుగుతుందన్నారు. అయితే అసలైన అర్హులకు ప్రయోజనం చేకూర్చేందుకే తమ ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకందని చెప్పారు. మరోవైపు రేపు కేటీఆర్ సహా తెలంగాణ అధికారుల బృందం గుజరాత్ వెళ్లనున్నారు. గుజరాత్ వాటర్‌గ్రిడ్ తీరుతెన్నులను, ఈ-పంచాయతీ పనితీరు, నిర్వహణలను ఈ బృందం పరిశీలించనుంది

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Deadline  Pensioners  Telangana  government schemes  KTR  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more