Jayalalitha to submit bail petition in supreme court

jayalalitha, karnataka high court, supreme court of india, jayalalitha bail petition, jayalalitha assets case, jayalalitha bail petition news, karnataka high court rejects jayalalitha bail petition, jayalalitha supreme court bail petition, jayalalitha lawyers

jayalalitha to submit bail petition in supreme court

సుప్రీంకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్!

Posted: 10/07/2014 07:51 PM IST
Jayalalitha to submit bail petition in supreme court

ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులు వున్నాయనే (అక్రమాస్తులు) కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెంగుళూరు సిబిఐ ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, వందకోట్ల జరిమానాతోపాటు ఆరేళ్ల అనర్హత వేటును వేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే జయమ్మ తనకు బెయిలు మంజూరు చేయాల్సిందిగా కర్ణాటక హైకోర్టులో పిటీషన్ ను కూడా దాఖలు చేశారు. దీంతో బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో దాదాపు మూడున్నర గంటలపాటు వాదోపవాదనలు వినిపించాయి. అటు ఆమె తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది జెఠ్మలానీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో వుంచుకుని బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. తర్వాత వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్ న్యాయవాది షరతులతో కూడిన బెయిల్ ఇస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు.

దీంతో బెయిల్ వచ్చేస్తుందని అందరూ భావించారు. ఇంకా బెయిల్ రాకముందే ఆమె అభిమానులు ముఖ్యంగా అన్నాడీఎంకే అనుచరులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు మొదలుపెట్టేశారు. కొద్దిసేపటివరకు అందరూ సంతోషంలో మునిగితేలారు. కానీ అంతలోపే వెలువడ్డ కోర్టు తీర్పు అందరికీ షాకిచ్చేసింది. జయలలితకు బెయిల్ మంజూరు చేయడం లేదంటూ హైకోర్టు ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించేసింది. ఈ వార్తను టీవీ ద్వారా తెలుసుకున్న జయలలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం వైద్యపరీక్షలు చేయించుకుంటున్న ఆమె.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆమె తరఫున న్యాయవాదులు బుధవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి సుప్రీమైనా ఆమెను దయదలిచి బెయిల్ మంజూరు చేస్తుందో, లేదో తెలుసుకోవాలంటే.. మరికొన్నిరోజులవరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha bail petition  karnataka high court  supreme court of india  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more