Chandrababu calls for rowdy sheeters free vijayawada

chandrababu naidu, bezawada, vijayawada, andhra pradesh, rowdy

chandrababu calls for rowdy sheeters free vijayawada

బెజవాడలో రౌడీ అనేవాడు ఉండకూడదు..

Posted: 09/27/2014 09:44 PM IST
Chandrababu calls for rowdy sheeters free vijayawada


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాబోతున్న విజయవాడలో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బెజవాడలో రౌడీ అనేవాడే ఉండకూడదన్నారు. ఇక నుంచి తాను విజయవాడవాసినే అని, ఇక్కడే ఎక్కువ కాలం ఉండి పాలన సాగిస్తానని అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఢిల్లీ నిర్భయ ఉదంతంతో టూరిస్టులు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే టూరిస్టులు సందర్శనలకు వస్తారని, దాంతో ఆదాయం పెరుగుతుందన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు.

మాఫీయాను క్షమించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పుడప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జరుగుతాయన్నారు.  వినోదం కోసం కోడిపందాలు ఆడితే తప్పులేదని అయితే డబ్బు పెట్టి ఆడటం నేరమన్నారు. హైదరాబాద్ బిర్యానీని మించిన వంటకాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వీజీటీ వుడాను మెగాసిటీగా అభివృద్ధి చేస్తామన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  bezawada  vijayawada  andhra pradesh  rowdy  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more