Unknown persons fired on mla jitendra singh

delhi, delhi firing, attacks, jitendra singh, attak on jitendra singh, jammu kashmir, latest news, bjp, narendra modi, shooting, delhi police, vivek vihar

unknown persons fired on bjp mla jitendra singh with very near : mla jitendra singh escaped safely attack from unknown persons

ఢిల్లీలో పట్టపగలే ఎమ్మెల్యేపై కాల్పులు

Posted: 09/03/2014 10:03 AM IST
Unknown persons fired on mla jitendra singh

దేశ రాజధాని హస్తినలో పట్టపగలే దుండగులు తెగబడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలో ఓ ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే, జమ్మూ కాశ్మీర్ బీజేపి నేత జితేందర్ సింగ్ పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అతి సమీపం నుంచి జరిపిన ఈ కాల్పుల నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఢిల్లీలోని వివేక విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగి హస్తిన ఉలిక్కిపడింది

ఎమ్మెల్యే బయటకు రాగానే.., అదును కోసం ఎదురుచూస్తున్న దుండగులు కాల్పులు ప్రారంభించారు. అయితే గన్ మెన్లు చాకచక్యంగా వ్యవహరించటంతో పాటు, జితేందర్ సింగ్ అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలిసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వివేక్ విహార్, సమీప ప్రాంతాల్లో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇది ఢిల్లీలో ఉన్న గ్యాంగుల పనా లేక వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని సహా దేశ ప్రముఖులంతా ఉండే ఢిల్లీలో భద్రత అత్యంత పకడ్బందిగా ఉంటుంది. అలాంటి చోట ఒక ఎమ్మెల్యేపైనే అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు అంటే.. ఇక సామాన్యుల భద్రత ఏంటని సందేహాలు తలెత్తుతున్నాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jitendra singh  delhi  shooting  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more