Governor being given additional charge of policing

Center for common policing Hyderabad. Telangana Home Minister vows to torch, Telangana Govt against common policing,

Governor being given additional charge of policing in common capital Hyderabad

గవర్నర్ కి ఉమ్మడి పోలీసింగ్ అధికారాలు!

Posted: 07/25/2014 08:48 AM IST
Governor being given additional charge of policing

తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానైన హైద్రాబాద్ లో ఉమ్మడిగానే శాంతి భద్రతల పర్యవేక్షణ జరగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని తెలిసింది. 

ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కి అధికారాలిస్తే మేం ఊరుకోం.  అగ్గి మంట పెడతామంటున్నారు సాక్షాత్తూ తెలంగాణా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.

రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రకారం హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని కనుక అక్కడ శాంతి భద్రతల బాధ్యత కూడా ఉమ్మడిగానే జరగాలని సూచించటం జరిగింది.  అందుకు అనుగుణంగా గవర్నర్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల డిజిపిలు అందులో సభ్యులుగా శాంతి భద్రతలను పర్యవేక్షించాలని బిల్లులో ఉంది.  అందుకు గవర్నర్ కి ఇద్దరు సలహాదారులను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించటం జరిగింది.  

కానీ తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది.  హైద్రాబాద్ మా రాష్ట్రంలోదే, మా రాష్ట్రాన్ని ఎలా నడిపించాలో మాకు తెలుసు అంటోంది తెలంగాణా ప్రభుత్వం.  

ఈ విషయంలో తన వ్యతిరేకతను తీవ్రమైన పదజాలంతో తెలియజేసిన తెలంగాణా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అదే గనక జరిగేత అగ్గి మంట పెడతాం అని తెలంగాణా భవన్ లో అన్నారు.  ఆ సమయంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more