Cm position crown of thorns chandrababu says

CM position crown of thorns Chandrababu says, Chandrababu tours his constituency Kuppam, Chandrababu reassures loan waiver and other promises

CM position crown of thorns Chandrababu says

ముఖ్యమంత్రి పదవి ముళ్ళకిరీటం- బాబు

Posted: 06/16/2014 06:37 PM IST
Cm position crown of thorns chandrababu says

ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గం రామకుప్పంలో ఈరోజు పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి ముళ్ళకిరీటమేనని అన్నారు.  

రాష్ట్రం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది నిజమే.  కానీ తాను కష్టపడటానికి తయారేనని, కష్టపడటం తనకి కొత్తకాదని అన్నారు చంద్రబాబు.  విభజన తర్వాత ప్రస్తుత ఆర్థిక స్థితి పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో ఉద్యోగుల జీతలివ్వటానికే రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని, ఆర్థిక వనరులు లేనందున కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అది సాధ్యమని అన్నారు.  రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని కూడా ఆయన అన్నారు.

ఈ సంక్షోభాన్ని సవాల్ గా తీసుకుని ముందుకెళ్దామని, అందుకు అందరు సహకరించాలని, అందరి ఆశీర్వాదాలు కావాలని చంద్రబాబు అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి నిధులు వచ్చే అవకాశం ఉందని భరోసా కూడా ఇచ్చిన చంద్రబాబు రైతుల ఋణమాఫీలతో సహా అన్ని హామీలను నెరవేరుస్తానని సభాముఖంగా మాటిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more