ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేది పత్రిక.. వారి తరపున వాకాల్లా పుచ్చుకుని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వాడే పత్రికా ప్రతినిధి. ఈ విషయం తెలిసినా నీళ్లు వదిలేసిన కొందరు మీడియా పెద్దలు ప్రభుత్వాల తరపున వాకాల్తా పుచ్చుకుని.. ప్రజల గోంతును అణిచివేస్తూ.. కుహానా కథనాలను ప్రచురిస్తూ తాము రాసేదే నిజం.. అందుకు ఇదిగో సాక్ష్యం అంటూ అబద్దాలను నిజాలుగా నమ్మించేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం వెలికి తీసిన కేసులో తమ గూటికి చెందిన పక్షి వుందని ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్థంభానికి పెను ప్రమాదం ముంచుకోచ్చినట్టు వినిపించిన గోంతులు.. అదే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టు విషయంలో ఎందుకు వినిపించలేదు.
అడ్డగోలుగా అరెస్టు చేసి.. కనీసం తన వాదనను కూడా న్యాయస్థానంలో వినిపించే అవకాశం లేకుండా.. తన తరపున ఢిపెన్సు న్యాయవాది వచ్చే లోపు న్యాయస్థానంలో విచారణ జరిపి జైలుకు తరలించిన పరిణామాల నేపథ్యంలో ఫోర్త్ ఎస్టేట్ కు బీటాలు వారినా.. ఒకరికి అనుకూలంగా వినిపించిన గొంతులు.. ఈ జర్నలిస్టు విషయంలో మాత్రం మూగబోయాయా.? లేక అధికార మత్తులో జోగాయా.? అన్న ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి.
నిజాలను నిర్భయంగా ప్రజలు ముందుకు ఉంచగలిగేన పాత్రికేయులను ఒకనాటి రాజకీయ నేతలు, ప్రభుత్వాధినేతలు శ్లాఘించేవారు. మరి ఇప్పటి పరిస్థితుల్లో తమకు తమ ప్రభుత్వానికి చేటు జరుగుతుందని తెలిస్తే.. ఎంతటి నిగ్గు తేల్చే నిజానికి సమాధి కట్టేలా చర్యలకు పూనుకుంటున్నారు. అయితే అరెస్టులు, లేదా బెదరింపులు.. అది కుదరకపోతే అమ్ముడు పోమ్మంటూ సామ,ధాన, భేధ దండోపాయాలను వినియోగిస్తున్నారు.
దేశానికి అటు జవాన్ ఇటు కిసాన్ పట్టుగొమ్మలు అని చెబుతూనే.. దేశ రాజధాని శివార్లలో రైతులు కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనోద్యమంలో వారి వాణిని దేశ ప్రజలకు వినిపించే జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారు. మీడియా అంటే యాజామాన్యాలే అన్న విధంగా మారిపోయి.. మేనేజ్ మెంట్ ను అడ్డం పెట్టుకుని.. మ్యానేజింగ్ కు తెరలేపుతున్నారు. ఇలా పూర్తిగా జర్నలిజం అర్థం మారడంతో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు.
అయినా సోషల్ మీడియాలో.. దేశానికే అన్నంపెట్టే రైతుల సమస్యలను వెలుగెత్తి చాటేందుకు నడుంబిగించిన జర్నలిస్టు మన్ దీప్ పూనియాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఆయనను అరెస్టు చేసేందుకు కారణాలు ఏంటని అంటే.. రైతుల నిరసనోద్యమం జరుగుతున్న ప్రాంతంలో శుక్రవారం స్థానికులుగా పేర్కోంటూ.. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టిన కొందరు.. రైతుల నిరసనలకు వ్యతిరేకంగా అందోళనకు దిగారు.. వారి గూడారాలను లాగారు. అంతేకాదు వారిపై రాళ్లు రువ్వారు. అయితే ఆ సమయంలో అక్కడే వున్న మన్ దీప్ యావత్ ఘటనకు సంబంధించిన ఫోటోలు తీశారు. అంతేకాదు వారు స్థానికులుగా పేర్కోంటున్నప్పటికీ వారికి బీజేపితో వున్న సంబంధాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు.
అంతటితో అగని మన్ దీప్ వారు కేవలం 50 నుంచి 60 మంది వరకు వున్నారని, వారిని పోలీసులు రక్షణ వలయంగా వున్నారని, అందోళనకారులు తమ వెంట పెట్రోల్ బాంబులు కూడా తెచ్చుకున్నారని, ఇక వాటిని మహిళ రైతులు నివసిస్తున్న గూడారాలపై విసిరారని, కూడా ఆయన అదే రోజున రాత్రి తన ఫేస్ బుక్ అకౌంట్ లైవ్ లో తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. అదే సమయంలో వచ్చిన అందోళనకారుల్లో స్థానికులని పేర్కోంటున్నా.. వారికి బీజేపి సంబంధాలు వున్నాయన్న విషయాన్ని కూడా ఆయన బహిర్గతం చేశారు. దీంతో తమ గుట్టు బయటపడిందన్న అక్కస్సుతో బీజేపి పెద్దల అదేశాలతో ఆయనను శనివారం అరెస్టు చేశారు పోలీసులు.
అయనను భయాందోళనకు గురిచేసేందుకు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. మన్ దీప్ ను అలిపూర్ పోలిస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆయనపై 186, 332, 353 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే అదివారం రోజున ఆయనను ఢిల్లీలోని రోహిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆయన తరపున వాదించేందుకు ఢిపెన్స్ న్యాయవాది లేకపోయినా విచారణ జరిపించేసిన పోలీసులు.. న్యాయమూర్తి అదేశానుసారం ఆయనను జైలుకు తరలించారు.
అయితే మన్ దీప్ ఏలాంటి టీఆర్పీ రేటింగ్ కోసమో అడ్డదారి తొక్కలేదు.. లేక రాత్రికి రాత్రి ఓ న్యూస్ ఛానెల్ కు సీఈవో కావాలనో అక్రమాలకు పాల్పడలేదు. ఇక తన ఛానెల్ లో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుని ఆ బిల్లులను ఎగ్గోట్టి ఏ ఇంజనీరు బలవన్మరణానికి కారణం కాలేదు. అంతెందుకు దేశరక్షణ విభాగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఆయన రహస్యంగా పోందలేదు.. దానిని ఇతరులతో పంచుకోనూ లేదు. ధైర్యంగా రైతుల సమస్యలను ఎలుగెత్తి చాటే ప్రయత్నం చేశాడు. అయినా.. ఆయనను అరెస్టు చేసినా.. సో కాల్డ్ గొది మీడియా పెద్దల అరెస్టులో వినిబడిన గోంతులు మన్ దీప్ విషయంలో మాత్రం వినిపించలేదు. ఇదే మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్ పరిస్థితి.
(And get your daily news straight to your inbox)
Feb 05 | పార్లమెంటులో ఇటీవల కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సందర్భంగా టీమిండియా విజాయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. టీమిండియా కుర్రాళ్ల విజయదాహానికి అస్ట్రేలియా సిరీస్ విజయం ఓ నిదర్శనమని దాని గురించి... Read more
Feb 04 | తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు జోరందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మంత్రులు ఇక తమ తదుపరి నేత ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక... Read more
Feb 03 | మరో నాలుగు మాసాల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో అక్కడ కూడా బలంగా పావులు కదపాలని గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపి నాయకత్వం.. ఎన్నికల బాధ్యతను మాత్రం తెలంగాణ నుంచి... Read more
Feb 02 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పై ఓ వైపు బడాయిలు చెబుతూనే మరోవైపు వారితో లడాయికి సిద్దమైందా.? అంటే ఔననే చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల పక్షపాతి అని..... Read more
Feb 02 | 2016 నవంబర్ అందరికీ గుర్తుండిపోయే నెల. అందులోనూ ఇక ప్రత్యేకంగా 8వ తేదీ అనగానే దానిని తలుచుకుని బాధపడే కుటుంబాలు అనేకం. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీగా పేర్కోనాల్సిన రోజు అది.... Read more