Employees fight via social media on centre సోషల్ మీడియా ఉద్యమాలతో కేంద్రానికి శరాఘాతం

Modi govt has a new headache social media campaigns by unhappy ias railways officers

Indian Civil Services, CAPF officers, #IPSGoBack, #Justice4CAPF, Indian Forest Service, Indian Railways, Twitter, Facebook, tool of protest, Modi government, Piyush Goel, Amit Shah, Central Government Employees, Politics

Government employees looking to express their grievances with the central government’s decisions and policies have been increasingly taking to social media, and the Modi government is not pleased.

సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకున్న కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు

Posted: 01/23/2020 05:57 PM IST
Modi govt has a new headache social media campaigns by unhappy ias railways officers

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల, విధి నిర్వహణలో తాము ఎదుర్కోంటున్న సమస్యల పట్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మాద్యమాన్నే తమ కొత్త అస్త్రంగా మలుచుకుంటున్నారు. అదే సామాజిక మాద్యమం. దీని వేదికగా చేసుకుని ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. తద్వారా అసలు విషయంతో పాటు విమర్శలను కూడా జోడించి విషయం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న క్రమంలో కేంద్రానికి ఇది పెద్ద సవాలుగా మారింది. అందివచ్చిన కొత్త అస్త్రంతో ఉద్యోగులు విమర్శలు చేస్తున్నా.. చర్యలు తీసుకునేలా ఎలాంటి చట్టాలు లేకపోవడంతో అధికారులు చోద్యం చూడక తప్పడం లేదు.

ఏ సామాజిక మాద్యమాన్ని తమ అస్త్రంగా మలుచుకుని తొలిపర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు ఇప్పుడు అదే అస్త్రం శరాఘాతంలో మారింది. కేంద్రం నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులు ఉద్యమాలు నడిపించడమే ఇందుకు కారణమం. కేంద్రంపై తమ వ్యతిరేకతను ఉద్యోగులు తోటి ఉద్యోగులను తెలియపడంతో పాటు వారిని కూడా సోషల్ మీడియా వేదికగానే సమీకరిస్తున్నారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టవ్యతిరేక నిరసనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర సర్కారుకు.. ఇది కొత్త తలనొప్పిగా మారింది.

నిన్న మొన్నటివరకు సెంట్రల్ ఆర్మ్‌డ్ ప్రొటెక్షన్ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్), అటవీ అధికారులు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు రైల్వే ఉద్యోగుల వంతు వచ్చింది. సర్వీసు విషయాల్లో కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సోషల్ మీడియా వల్ల అనుకోని రక్షణ, ప్రభుత్వ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేకపోవడం ఉద్యోగులకు వెసులుబాటుగా మారింది. బీఎస్‌ఎఫ్ సీఆర్‌పీఎఫ్ తదితర సంస్థలు సీఏపీఎఫ్‌ల్లో అంతర్భాగం. వీరికి ప్రత్యేక సర్వీసు నియమాలు ఉంటాయి.

అయితే, ఈ సంస్థల కీలక పదవుల్లో ఐపీఎస్‌ల నియామకం ఎక్కువైంది. డిప్యూటేషన్‌పై వచ్చి తిష్ఠ వేస్తున్న అధికారులు.. ఉద్యోగులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. సీనియర్ అధికారులు, ఉద్యోగులు ఐపీఎస్‌ల పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ‘గో బ్యాక్ ఐపీఎస్’, ‘జస్టిస్ 4 సీఏపీఎఫ్’ తదితర హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతున్నారు. వీరి బాటలోనే అటవీ అధికారులు, ఉద్యోగులు నడుస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా అటవీ అధికారులపై దాడులు అధికమయ్యాయి. అడ్డు వచ్చిన అటవీ ఉద్యోగులను స్మగ్లర్లు హత్య చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైల్వేలోని ఎనిమిది సర్వీసులను ఏకీకృతం చేసి, ఒకే సర్వీసు కిందికి తీసుకువస్తామని నెలరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమైంది. యువ అధికారులు, ఉద్యోగులు సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. నిరంకుశ విధానాలను వీడాలని కోరుతున్నారు. తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగులు సోషల్ మీడియాను వేదికగా చేసుకోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. మారుపేరు మీద ఉన్న ఐడీలు, చిరునామాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఎవరు విమర్శలు చేస్తున్నారో గుర్తించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. మరికొందరు తమ సొంత ఐడీలనే వినియోగిస్తున్నారు. ఇలా పలువురు రైల్వే ఉద్యోగులు చేశారు. కానీ, ఆ శాఖలో ఉద్యోగులు లక్షల్లో ఉన్నారు. అందులో సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులు పోస్టులు పెడుతున్నారు. ఒక్కరో ఇద్దరో అయితే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఒకేసారి వేలమంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు.

మరోవైపు సమస్య ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి త్వరగా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. చిన్న విమర్శనూ సహించేస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. అలాంటిది సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు నడుస్తుండటంపై పలువురు కేంద్ర మంత్రులు అసహనంతో ఉన్నారు. ఈ విషయమై ఇటీవల సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా సీనియర్ రైల్వే అధికారుల సమావేశంలో సోషల్ మీడియా అంశాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • N korea s kim jong un appears in public amid health rumours

  ప్రజల ముందుకొచ్చినా.. కిమ్ విషయంలో తెరపడని అనుమానాలు.?

  May 02 | ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతిపై ప్రపంచదేశాల మీడియాకు అనుమానాలు వీడటం లేదు. పలు దేశాల మీడియా ఆయన అరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణించాడంటూ ఓ వీడియో కూడా... Read more

 • Why ruling party activists obstruct oppositions from contesting elections

  బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

  Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more

 • Yes bank crisis center actions create tension in account holders

  యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

  Mar 07 | యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల... Read more

 • Constable sridhar reddy transfered for kicking father of deceased student

  కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

  Mar 07 | సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్... Read more

 • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

  రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

  Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

Today on Telugu Wishesh