kapu to merge into BC group soon.? కాపులు త్వరలో బిసి జాబితాలోకి.?

Kapus long lasting demand to be fulfilled by ncbc

Rajya Sabha, parliament, OBC Commission, NCBC, Constitutional status, Bill, kapus into BC group, kanna laxminarayana, BJP

kapus longlasting demand of merging them into BC gorup is to be fulfilled by National Commission of Backward Caste.?

కాపులు త్వరలో బిసి జాబితాలోకి.?

Posted: 08/07/2018 12:54 PM IST
Kapus long lasting demand to be fulfilled by ncbc

అంధ్రప్రదేశ్ లో పట్టు సాధించడం కోసమో లేక కాపుల దీర్ఘకాలిక డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని వారిని మచ్చిక చేసుకోవడం కోసమో బీజేపి అడుగులు వేస్తుందనే చెప్పాలి. దక్షిణభారతదేశంలో అంతగా పట్టులేకపోయినా.. కర్ణాటకలో అధికారం వస్తుందని ఆశించి.. కొద్దిలో చేజారిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తమ జెండాను రెపరెపలాడించాలని ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తుంది బీజేపి. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో వున్న కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ఇక వేగిరం చేయనుందా.? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.

కాపులు చిరకాల వాంఛను అర్థం చేసుకున్న బీజేపి.. వారికి బిసీ హోదాను కల్పించే పనిలో నిమగ్నమైంది. ఎన్నో ఏళ్లుగా కాపులు తమను బిసి జాబితాలో చేర్చాలని చేస్తున్న డిమాండ్ ను బీజేపి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్రాలలో తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రాంతీయ అజెండాలతో వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్న బీజేపి.. ఏపీలో అధికారాన్ని అందుకోవడం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంది. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల హామిని ఇచ్చిన బీజేపి.. ఇక దానిని పక్కనబెట్టి.. అధిక సంఖ్యలో వున్న కాపులకు మాత్రం లభం చేకూర్చేందుకు.. తద్వారా రాజకీయంగా బలపడేందుకు వ్యూహాలను రచిస్తోంది.

ఇందులో భాగంగానే సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కోనసాగి.. పలు పర్యాయాలు మంత్రిగా కూడా కొనసాగిన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను బీజేపి శ్రేణుల అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్ర బీజేపి అధ్యక్ష పదవికి పట్టం కట్టిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓ వైపు తనకు కులం, మతం, ప్రాంతం ముఖ్యం కాదు.. ప్రజాసంక్షేమమే ముఖ్యం. ప్రజాసమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన ముఖ్యమని అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ నినదిస్తూ.. కులాల వారిగా విభజిస్తూ రాజకీయ పార్టీలు అంగ్లేయులు నేర్పిన విభజించి పాలించు సూత్రాన్ని అమలు పర్చడం దౌర్భాగ్యమని గొంతెత్తుతున్నా.. జాతీయ పార్టీ మాత్రం అదే సూత్రాన్ని ఫాలో అవుతుందా.? అంటూ ఔనన్న సమాధానాలే వినబడుతున్నాయి.

గత నాలుగేళ్లుగా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో డిమాండ్లు తెరపైకి వస్తున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించిన కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు.. త్వరలో రానున్న తెలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మాత్రం మరీ ముఖ్యంగా కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. వెనకబడిన కులాల జాతీయ కమీషన్ (ఎన్.సి.బి.సి) ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు రాజ్యాంగ హోదాను కల్పించే 123వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు అమోదం పోందడమే బీజేపి ఎత్తుగడ వ్యూహాలను ప్రతిభింబిస్తుంది.

ఇదే విషయమై గతంలో రాష్ట్రంలోని అధికార చంద్రబాబు సర్కారు కూడా కేంద్రానికి లేఖ రాసినా.. పట్టనట్లు వ్యవహరించిన కేంద్రం.. ఇప్పుడు టీడీపీతో మైత్రిబంధాన్ని తెంచుకున్న తర్వాత మాత్రం అఘమేఘాల మీద ఇందుకు సంబంధించిన చర్యలకు పూనుకుంటూ.. కాపులపై తమ ప్రేమను కనబరుస్తుంది. అయితే గత నాలుగేళ్లుగా కాపులకు పెద్ద కాపరిగా వ్యవహరిస్తూ వచ్చి.. వారికి తమ పార్టీ అండదండలను కూడా వున్నాయని చెప్పిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో కూడా కాపుల రిజర్వేషన్ అంశంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయించడం కూడా బీజేపి వ్యూహరచనలో భాగమనే వార్తలు వినబడుతున్నాయి.

అసలు ఈ  వెనకబడిన కులాల జాతీయ కమీషన్ (ఎన్.సి.బి.సి) ఏర్పాటు దేనికి.? అంటే.. తాజాగా చేసిన సవరణ బిల్లు ప్రకారం వెనుకబడిన తరగతుల వారిని చేర్చడం, లేదా తొలగించాలనే అభ్యర్థలను పరిశీలించడం, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సూచనలిచ్చే అధికారం నేషనల్ కమిషన్‌కు లభిస్తుంది. దీంతో స్వతహాగా బిసి అయిన ప్రధాని మోదీ.. బీసిల సంక్షేమానికి కట్టుబడి వున్నాడన్న సంకేతాలను దేశవ్యాప్తంగా పంపుతున్నా.. అసలు దీనిని ఇప్పుడు ఇంత వేగంగా తెరపైకి తీసుకురావడం మాత్రం కేవలం కాపులను బిసిలలో చేర్చేందుకనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా బీజేపి వ్యూహాలు ఫలించి.. కాపులు బిసిలలో చేర్చితే వారి దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles