Are BJP women leaders hungry of power? ఈ బీజేపి మహిళా నేతలు.. దేశద్రోహులు కారా..?

Why bjp women leaders sharing fake images on social media

Fake Image, Kolkata, Basirhat, Baduria, West Bengal, Nupur Sharma, Communal violence, Gujarat riots photo, fake image on social media, hindu woman, rape images, gundas in bengal, Bhojpuri film, Vijeta Malik, haryana, bjp leader, filmy images, defaming mamta, mamta banerjee, hardik patel, kanniah kumar, terrorists

Is reponsible BJP leaders irresponsible in tweeting and sharing fake images of riots and encouraging communal violence, why don't bjp leadership take action against them.? why can't it be be equated with hardik patel seduction case.?

ఈ బీజేపి మహిళా నేతలపై.. చర్యలు వుండవా.?

Posted: 07/11/2017 06:09 PM IST
Why bjp women leaders sharing fake images on social media

సోషల్ మీడియా.. టెలీ కమ్యూనికేషన్ రంగంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన నూతన విధానాల పుణ్యమా అని ఈ రోజు దేశంలోని అనేక వర్గాల ప్రజలు దీని ఫలాలను అందుకుంటున్నారు. ఇది ప్రధానిగా ఆయన హాయంలో చేసిన ఒక గొప్ప కార్యం. అయితే కాంగ్రెస్ ను నిత్యం విమర్శించే బీజేపి మాత్రం దీనిని ఫలాలను అన్ని రాజకీయ పార్టీలకన్నా అధికంగా అందిపుచ్చుకుంది అంటే అతిశయోక్తి కాదు. ఎంతలా అంటే.. ఏకంగా ఇటీవల జరిగిన ఎన్నికలలో పార్టీ టిక్కెట్ కావాలంటే మీ ఫేస్ బుక్ అకౌంట్ లో ఎంత మంది ఎక్కువ ఫాలోవర్స్ వుంటే.. వారికే టికెట్ ఇస్తామని ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారన్న కథనాలు జాతీయ పత్రికలలో ప్రముఖవార్తలుగా మారాయి.  

దేశంలో 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఏం చేసింది అన్న నేటి బీజేపి అగ్రనాయకులు సమాధానం వారికే కనిపిస్తున్నా.. ప్రజలను తమ వైపుకు అకర్షించేందుకు విమర్శలు చేయక తప్పనిస్థితి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. రాష్ట్రాలుగా విడిపోయానా దేశంగా భారత జాతి బిడ్డలందరూ ఒక్కటే. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం, అధికార వికేంద్రీకరణ జరిగిందని, అదికూడా బాషాప్రయుక్త రాష్ట్రాలుగా జరిగిందన్న దేశ ప్రజలందరికీ తెలిసిందే. అయితే హక్కులు, విధులు, బాథ్యతల విషయానికి వచ్చేసరికి దేశ పౌరులందరికీ అవి సమానంగానే వుంటాయన్నది కాదలేని అంశం.

అలాగే దేశంలో ఎక్కడైనా హింసను రాజేసేందుకు యత్నించినా.. మతసామరస్యతకు విచ్ఛిన్నం కల్గించేలా వ్యవహరించినా.. అది నేరమే. హింసాయుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బాధ్యతాయుతమైన పత్రికలు, మీడియా కూడా అలాంటి వార్తలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా సంయమనం పాటిస్తాయి. మీడియా రంగంలో వున్న పోటీ నేపథ్యంలో కూడా ఎవరూ ఇలాంటి వార్తలను ప్రచురించరు. అయితే మీడియా కన్నా అధికంగా ప్రస్తుతం సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావడంతో దానిపై నియంత్రణ కూడా లేకపోవడంతో.. ఎవరికి అభిప్రాయాలను వారు తెలుపుతున్నారు.

ఇంతవరకు బాగానే వున్నా.. హింసను ప్రేరేపించే విధంగా, ఫేక్ ఫోటోలను తెరపైకి తీసుకువచ్చి.. మతవాదంలో.. ఒక వర్గం వారు.. మరో వర్గంపై హింసకు పాల్పడుతున్నారని జరగని ఘటనలను జరిగినట్లు చెప్పడం కూడా నేరమే. అయితే నేరపూరితమైన కుట్రతో హింసాయుత విధ్వేషాలు రెచ్చగొడుతూ.. అందుకు సంబంధించి ఫేక్ ఫోటోలను పోస్ట్ చేసిన బీజేపి రాష్ట్రస్థాయి నేతలపై మాత్రం పార్టీపరంగా బీజేపి ఎందుకు చర్యలు తీసుకోదు.? ఇప్పడిదే ప్రశ్న రాజకీయాలలో చర్చనీయంశంగా మారింది.

అనువణువునా దేశభక్తి వున్నట్లు చెప్పుకునే బీజేపి.. దేశంలో విధ్వేషాలకు.. హింసను ప్రేరేపించే విధంగా పాల్పడిన మహిళా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది మిలియన్ డాల్లర్ల ప్రశ్నగా మారింది. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న హయాంలో చెలరేగిన గుజరాత్ అల్లర్ల నాటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి.. పశ్చిమ బెంగాల్ లో హిందువులకు రక్షణ కరువైందని మతహింసను రెచ్చేగోట్టే ప్రయత్నం చేసిన ఢిల్లీ బీజేపీ నేత నుపూర్‌ శర్మపై ఎట్టకేలకు కొల్ కతా పోలీసులు కేసు నమోదు చేసినా.. బీజేపి అగ్రనాయకత్వం మాత్రం వారిపై ఎందుకు చర్యలు తీసుకోదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మతఘర్షణలకు ప్రోత్సహించే విధంగా మరింతగా హింస రాజుకునేందుకు కుట్రపన్నుతూ తప్పుడు ఫోటోలను షేర్ చేసిన అమెతో పాటు.. అంతకుముందు ఇలాంటి కల్పిత ఫోటోలనే పోస్టు చేసిన హర్యానాకు చెందిన ఓ మహిళా నేత విజేత మాలిక్ పై బీజేపి నాయకత్వం ఏలాంటి చర్యలు తీసుకుందన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నామని చెప్పుకునే బీజేపి.. మతవాదానికి ఎందుకు పాల్పడుతుందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

గుజరాత్ పటేల్ కులస్థుల ఉద్యమంలో తెరపైకి వచ్చిన హార్థిక పటేల్ ను హింసకు కారణమవుతున్నాడని కారణాలను ఎత్తి చూపిన ఆ రాష్ట్రంలోని బీజేపి ప్రభుత్వం.. ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. జైలు పాలు చేసింది. అంతటి తీవ్రస్థాయిలో కాకపోయినా.. హింసను రెచ్చగోట్టే పోటోలను సోషల్ మీడియాలో పెట్టి.. వాటని విఫరీతంగా షేర్ చేయాలని పిలుపునిచ్చిన బీజేపి మహిళా నేతల విషయంలో ఆయా రాష్ట్ర నాయకత్తాలు చర్యలు తీసుకోకపోవడం కూడా విమర్శలకు తావిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : west bengal.  mamata banerjee  Vijeta Malik  nupur sharma  BJP  TMC  hardhik patel  Politics  

Other Articles