Nara Lokesh may get Ministery in AP cabinet

Nara lokesh may get ministery in ap cabinet

Nara Lokesh, AP, Chandrababu Naidu, Minister, AP Cabinet

Chandrababu Naidu who is AP CM and Lokesh father, may give as a ministry. may he will get IT Ministry.

లోకేష్ కు మంత్రి పదవి...?

Posted: 03/26/2016 04:32 PM IST
Nara lokesh may get ministery in ap cabinet

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లోకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు చోటు కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్‌ను రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బాబు అండ్ టీంలో కలిగిందనే ప్రచారమూ గతంలో జరిగింది. ఐతే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే చినబాబు భవిష్యత్తుకు ఢోకా ఉండదని చంద్రబాబు భావిస్తున్నారనే టాక్‌ ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ పరిపాలన వ్యవహారాల్లోనూ లోకేష్ జోక్యం చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు లోకేష్ తో టచ్ లో ఉంటున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తే.. నేషనల్ ఫోకస్ వస్తుందని కొందరు బాబుకు సలహా ఇచ్చారంటున్నారు. అయితే అక్కడి కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే లోకేశ్‌ భవిష్యత్తుకు ఢోకా ఉండదని బాబు భావిస్తున్నారట... పైగా లోకేష్‌కు రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో వ్యతిరేకత వచ్చే ప్రమాదమూ ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

లోకేశ్‌ ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. పైగా ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అందుకే, ఆయన్ను నేరుగా మంత్రి వర్గంలోకి తీసుకొని ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేయడానికి బాబు స్కెచ్ వేశారనే టాక్ టీడీపీ అత్యున్నత వర్గాల్లో వినిపిస్తోంది.. లోకేష్ ను మంత్రిని చేసి ఐటీ, కమ్యూనికేషన్లు, యువజన సర్వీసుల శాఖను అప్పగించాలని.. తద్వారా యూత్ కు లోకేష్ దగ్గరవుతాడనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  AP  Chandrababu Naidu  Minister  AP Cabinet  

Other Articles