Telugu stars | farmers | Suicide

Why our telugu stars cant do that

Telugu stars, farmers, Suicide, Mahesh babu, Nana Patekar, Srimanthudu

Why our telugu stars cant do that. Nana patekar help the farmers familes who suicide in Maharastra.

తెలుగు హీరోలు ఎందుకు చెయ్యలేరు..?

Posted: 09/07/2015 10:00 AM IST
Why our telugu stars cant do that

తెలుగు సినిమా పరిధులు దాటుతోంది.. నిన్నటి దాకా దక్షిణాది రాష్ట్రాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న తెలుగు సినిమా దేశంలో, ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలను ఆర్జిస్తోంది. అయితే తెలుగు సినిమాల్లో నటించే వాళ్ల రెమ్యునరేషన్ గురించి చూస్తే మాత్రం నోరెల్ల బోట్టాల్సిందే. బాలీవుడ్ తారలకు ఏ మాత్రం తీసిపోని విధంగా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్వహించే ఏ ఈవెంట్ కైనా నిధులు వెల్లువలా వస్తుంటాయి. హుద్ హుద్ తుఫాన్ బాధితుల కోసం చేసిన కార్యక్రమం అందరి మన్ననలు పొందింది. అయితే ఎప్పుడో ఒక సారి అలా చేసి వదిలెయ్యకుండా.. కష్టం వచ్చిన ప్రతిసారి ప్రజల ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు. నానా పాటేకర్ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు తనవంతుగా ప్రతి కుటుంబానికి తనకు తోచినంత ఇచ్చి పెద్ద మనసును చాటుకురన్నారు. మరి మన వాళ్లు ఎందుకు ఇలా ముందుకు రావడం లేదు..?

శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు ఏపిలో, తెలంగాణలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవడం. తర్వాత ఒకరిద్దరు హీరోలు కూడా అదే బాటలో నడవడం చాలా మంచి పరిణామం. అయితే గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు అందరిని కలిచివేస్తున్నాయి. ఒకే రోజులో ఎనిమిది మంది రైతులు అప్పుల బాధ తట్టుకోలేన ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా దారుణం. అయితే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలా దుర్భరంగా మారిన రైతుల, వారి కుటుంబాల కళ్లలో మన తెలుగు స్టార్స్ అనుకుంటే వెలుగులు నింపగలరు. ఒక్కో స్టార్, ఒక్కె కళాకారుడు తమకు తోచినంత సహాయం చెయ్యడంతో పాటు.. రైతుల ఆత్మహత్యల మీద స్పందించి వాటికి అడ్డుకట్ట వెయ్యవచ్చు. కానీ మన తెలుగు మీడియా కూడా అందుకు సహకరించాలి. వారి ప్రతి విషయాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నా.. వారి నుండి సమాజానికి మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా ముందుండి నడిపించాలి. మన తెలుగు వారు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా స్టార్స్ అని మరోసారి నిరూపించుకోవాలని కోరుకుంటున్నాం..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu stars  farmers  Suicide  Mahesh babu  Nana Patekar  Srimanthudu  

Other Articles