Kcr will face danger situations in politics in the future

kcr poltical career, k chandra shekar rao, k taraka rama rao, kalvakuntla chandra shekar rao, telangana political situations, telangana recent news, telangana state news, telangana political damage

Dalith to be Telanganas first CM if party comes to power. kcr will face danger situations in politics in future

వాళ్ళకెందుకు పదవులు ఇచ్చారో తెలియక తలలు పట్టుకుంటున్నరటా...!

Posted: 12/19/2014 01:01 PM IST
Kcr will face danger situations in politics in the future

మంత్రి వర్గ విస్తరణ తెరాస పార్టీ లో ముసలం పుట్టిస్తుంది. ఇప్పటికే అన్ని రాకాలుగా అటు తిప్పి ఇటు తిప్పు మొత్తానికి మంత్రి వర్గ విస్త"రణ"ను ముగించిన కెసిఆర్ ఇప్పుడు మరో రకం తల నొప్పి తో బాధ పడుతున్నారట.. సొంత పార్టీ లోనే ఎదో అసంతృప్తి మొదలయ్యిందని, తనకు తెలీకుండా ఎదో జరుగుతుందని గ్రహించినట్టు ఉన్నారు కెసిఆర్. అందుకే ఇటీవల పార్టీ ముఖ్యులందరినీ పిలిచి.., త్వరలోనే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని.., కష్టపడే వాళ్ళకు గుర్తింపు ఉంటుందని చెప్పారట. కాని కాస్త పడే వాళ్లకు గుర్తింపు ఉంటె మొన్నన జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనే గుర్తింపు ఉండేదని అప్పుడు లేని గుర్తింపు మల్లి ఇప్పుడెలా వస్తుందని తమ లోపల తామే మదన పడుతున్నరటా... దానికిన్ ఉదాహారణ గా తెరాస ఎం.ఎల్.ఏ కొప్పుల ఈశ్వర్ ను చుపుతున్నారట... ఎప్పటినుండో అనేక సభలలో ఈ దళిత నేతను అత్యున్నత స్థాయిలో గౌరవించుకుంటామని, మంత్రి పదవి కట్ట బెడతామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మాట తప్పి తెరాస కింది స్థాయి కార్యకర్తల్లో కూడా అనేక అనుమానాలను రేకెత్తించారన్నది సొంత పార్టీ లోని కొన్ని వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి.

అంతకు ముందే దళిత ముఖ్యమంత్రి ని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పటం ఇప్పటికే ఏదైనా అవకాశం దొరికితే ప్రతి పక్ష సభ్యులతో పాటు, ప్రజలలోని కొన్ని వర్గాల ముందు కూడా మొహం చూపెట్టలేకపోతున్నామని, మళ్ళి ఈ మంత్రి వర్గ విస్తరణతో ఆ వర్గాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా సొంత పార్టీ లోనే వ్యతిరేకత రావటంతో తెరాస కార్యకర్తలు ఎం చేయాలో పాలుపోక బిక్క మొహం వేస్తున్నారట... త్వరలోనే కొందరు అసంతృప్తులు కెసిఆర్ ముందు తమ "ఎర్ర జెండా"ను ఎగరవేసి తమ అక్కసును వెళ్లగక్కే అవకాశం ఉందని.., ఇంత చెప్పిన వినకపోతే.., ఇలానే కొన్ని వర్గాలను  నిర్లక్ష్యం చేస్తే ప్రభుతావ్ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తుందని.., తెరాస వర్గాల్లోని కింది స్థాయి కార్యకర్తలు గుసగుస లాడుకుంటున్నారట..!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles