former minister shabbir ali makes controversial comments on kcr and on his family members | congress party | warangal elections

Former minister shabbir ali fires on kcr family members

shabbir ali, kcr, kcr news, kcr press conference, shabbir ali press conference, shabbir ali press meet, warangal elections

former minister shabbir ali fires on kcr family members : former minister shabbir ali makes controversial comments on kcr and on his family members.

కేసీఆర్‌ పచ్చి అబద్ధాలకోరు - షబ్బీర్‌అలీ

Posted: 11/13/2015 03:26 PM IST
Former minister shabbir ali fires on kcr family members

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు మరింత పెరుగుతున్నాయి. తొలుత రాష్ట్రాభివృద్ధిలో ఎన్నోరకాల ప్రణాళికలు చేపడుతున్న ఆయన.. వాటిని ఆచరణలోకి తీసుకునిరావడంలో చాలా ఆలస్యం చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈయనపై చాలామంది నేతలు తమ నోటికొచ్చినట్లు కొత్తకొత్త పదాలతో తిట్లు తిట్టేస్తున్నారు. తన మాయమాటలతో కేసీఆర్ ప్రజల్ని మభ్యపెట్టి.. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వల్ల రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోయిందంటూ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ తరహాలోనే తాజాగా మాజీమంత్రి షబ్బీర్ అలీ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం వరంగల్ ప్రచారంలో ఫుల్ బిజీగా వున్న షబ్బీర్ అలీ.. ఈ సందర్భంగా కేసీఆర్, ఆయన కుటుంబం మీద మండిపడ్డారు. కేసీఆర్‌ పచ్చి అబద్ధాలకోరని ఆయన విమర్శించారు. ఇటీవల కేసీఆర్‌పై జరిగిన సీబీఐ విచారణ వివరాలను బయటపెట్టాలని ఆయన కోరారు. కేసీఆర్‌ కుటుంబ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమాన్ని మరిచి, స్వంత స్వలాభాల చూసుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలు ఏదో ఒకరోజు కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేక పోరాటం కచ్చితంగా చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కేటీఆర్‌, కవితలకంటే మావోయిస్టు శృతి ఎక్కువగా పోరాడారని, కాని ఆమెను అన్యాయంగా, అత్యంత దారుణంగా హత్యచేశారని షబ్బీర్‌అలీ ఆరోపించారు. కేసీఆర్ మాటల్ని నమ్మొద్దంటూ ప్రజలను హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shabbir ali  kcr press conference  warangal elections  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more