అవును మీరు చదివింది నిజమే అని అంటున్నారు బాలీవుడ్ బాబులు. అంటే అత్త మామలకు దూరంగా తన భర్తతో కలిసి వేరు కాపురం పెట్టినట్లు బాలీవుడ్ చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు , అత్త జయా బచ్చన్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ఐశ్వర్యరాయ్ కి కూతురు పుట్టి రెండు సంవత్సరాలు దాటినప్పటికి .. ఇంక ఐష్ పై అత్తా పెత్తనం మితిమీరిపోవటంతో.. ఐష్ బాగా విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే అభిషేక్ బచ్చన్ తో గత కొన్ని రోజులు నుండి ఐశ్వర్యరాయ్ కొత్త కాపురం గురించి చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే పెళ్ళైన ఇన్ని ఏళ్ళకి అత్త కోడళ్ళు మద్య గొడవలు ఎందుకోచ్చాయో అని విషయం అర్థం కాక అబిషేక్ జుట్టు పీక్కుంటూన్నడని బాలీవుడ్ బాబులు అంటున్నారు. మొదట్లో జయాబచ్చన్ కోడలు ఐష్ పై అమితమైన ప్రేమ చూపించేది. కోడలిపై ఈగ వాలినా సహించేది కాదు. ఆ మధ్య జరిగిన ఓ ఫంక్షన్లో ప్రెస్ వాళ్ళు .....తన కొడలిని ‘ఐశ్వర్య' అని పిలవడం జయా బచ్చన్‌కు ఆగ్రహంతో ఊగినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . తన కోడలిని అలా పిలవొద్దని....‘ఐశ్వర్య రాయ్ బచ్చన్' అని పూర్తి పేరుతో పిలవాలని ఆమె సూచించారు. ‘ఏంటి ఐశ్వర్యా..ఐశ్వర్యా అని పిలుస్తున్నారు. ఆమెతో మీరు కలిసి చదువుకున్నారా ?' అంటూ జయా బచ్చన్ మీడియా ప్రతినిధులపై ఫైర్ అయ్యే సరికి మీడియా ప్రతినిదులు మొహం తేలేసారు.
అత్త జయాబచ్చన్ గురించి ఐష్, అబిషేక్ కూడా చాలా సార్లు గొడవ పడినట్లు సమాచారం .ఈ గొడవలు ఎంత దూరం వెళ్తాయో అని అమితాబ్ చాలా ఫీల్ అయ్యారని తెలుస్తోంది. ఐష్ మొదటి నుండి మామ గారైనా అమితాబ్ తో సన్నిహితంగా ఉండేదని , అయితే ఆ విషయం జయ బచ్చన్ నచ్చక అనేకసార్లు గొడవ పడినట్లు సమాచారం. అయితే ఇంట్లో గొడవలు ముదరటంతో.. ఐష్ ఈ నిర్ణయం తీసుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే అభిషేక్ బచ్చన్ మాత్రం అందుకు సిద్దంగా లేరనే వార్తలు కూడా బాలీవుడ్ వినిపిస్తున్నాయి. వీరి మద్య బిగ్ బి మాత్రం నలిగిపోతున్నాడని బాలీవుడ్ బాబులు చెవులు కొరుక్కుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more