స్టార్ సింగర్ గీతామాధురి భారీ రేటు పలికినట్లు టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా స్టార్ సింగర్ గీతామాధురి నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. ఆమె నిశ్చితార్థం విషయం తెలిసిన వెంటనే.. టాలీవుడ్ లో వార్తలు రావటంతో.. కొంతమంది అసలు విషయం పై ఆరా తీశారు. భారీ రేటు పలికిన గీతామాధురి అనగానే.. కొంత మంది నోటీ వేలేసుకున్నారు. మరికొందరు.. అదోకరకమైన ఆలోచనల్లోకి వెళ్లటం జరిగింది. నిన్నటి వరకు మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి పై ఎలాంటి వార్తలు ఏమిటి అనుకుంటూ.. కొంచెం ముందు వెళ్లి అసలు విషయం తెలుసుకొని, ఊపిరి పీల్చుకుంటూ ఫిలింనగర్ వదిలి.. సిటీలోకి రావటం జరిగింది.
అయితే మొదటి మాలో కూడా కొన్ని విచిత్రమైన ఆలోచనలు వచ్చినప్పటికి వాటిని పక్కన పెట్టి, నిజం నిలబడి ఎదురు చూశాం. అందుకు లెటెస్ట్ న్యూస్ మాకు అందింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ సింగర్ చేయని విధంగా గీతా మాధురి చేయటం అందరికి విచిత్రమే అయిన.. ఇక తప్పని పరిస్థిత్లులో గీతామాధురి గీత దాటి ఉంటుందనే విషయం మాకు అర్థమైంది. అసలు విషయం ఏమిటంటే.. స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకున్న గీతామాధురి గత రెండు సంవత్సరాల నుండి నటుడు నందుతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ వారంలోనే.. అతి కొద్ది మంది బంధువుల మద్య గీతామాధురి నందుల నిశ్చితార్థం జరిగింది.
దీంతో ఇప్పుడు అందరు ఆమె పెళ్లి గురించి చెప్పుకుంటున్నారు. అసలే సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. కొన్ని మీడియా వారి ద్రుష్టి గీతామాధురి పెళ్లి పై పడింది. అంటే ఇటీవల సెలబ్రిటీ వేడుకులను కొన్ని మీడియా సంస్థలు సొంతం చేసుకోవటం మనకు తెలుసు. ఇప్పుడు అదే బాటలో గీతా మాధురి, నందుల పెళ్లి కూడా ఒక మీడియా సంస్థ సొంతం చేసుకుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. గీతామాధురి పెళ్లి లైవ్ టెలికాస్ట్ భారీ రేటు పలికినట్లు సమాచారం. ఇప్పుడు గీతా కూడా అదే వరుసలో చేరుతుంది.
గీతామాధురికి ఉన్న పరిచయాల రీత్యా ఆమె వివాహానికి టాలీవుడ్ సెలెబ్రెటీలంతా వచ్చే అవకాశం ఉంది. ఛానెల్స్ వారు కూడా ఎలాగూ టాలీవుడ్ సెలెబ్రెటీలంతా ఉండే వేదిక కనుక తమ టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయని పోటీ పడుతున్నారు. అయితే గీతామాధురి .. ఒక మీడియా సంస్థకు భారీ రేటు తన పెళ్లి లైవ్ టెలికాస్ట్ ను ఇచ్చినట్లు సమాచారం. మీడియా సంస్థలు పోటీ పడటంతో.. భారీ రేటు పలికినట్లు సమాచారం. గీతామాధురి పెళ్లి లైవ్ టెలికాస్ట్ రేటు కోటీ రూపాయాలు పలికినట్లు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కొట్టిపరేస్తున్నారు. మరి కొంత మంది గీతామాధురి పెళ్లి లైవ్ రేటు కోటి పలికిన తప్పలేదని సమర్థించే ఆమె అభిమానులు లేకపోలేదు. దీంతో ఇప్పుడు గీతా మాధురి, నందుల పెళ్లి పైనే చర్చలు జరుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more