ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి, ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తీసిన ‘అత్తారింటికి దారేది ’ సినిమాను విడుదలకు ముందే తస్కరించి మార్కెట్ లోకి విడుదల చేసిన సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీనే ఓ కుదుపు కుదుపేసిన విషయం తెలిసిందే. నిన్న వరకు ఈ సినిమా ఎలా లీక్ అయ్యిందో అని తలలు పట్టుకున్నారు. కానీ ఈ సినిమాను సదరు నిర్మాత ల్యాబ్ లో పని చేసే ప్రొడక్షన్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి తస్కరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైయింది. దాదాపు 85 నిమిషాల పైగా చిత్రాన్ని త్కస్కరించి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ ద్వారా ఈ చిత్రాన్ని పెడనకు, అక్కడి నుండి మచిలీపట్నానికి వెళ్లిన తరువాత అక్కడ ఈ చిత్రాన్ని 5 భాగాలుగా చేసి విక్రయించడంతో ఈ విషయం బయటకి పొక్కింది. దీంతో అలర్ట్ అయిన నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోని ఈ ఆపరేషన్ ని సక్సెస్ గా పూర్తి నిందితుల్ని పట్టుకున్నారు. ఫైనల్ గా ఈ లీకేజీ ప్రొడక్షన్ ల్యాబ్ నుండి క్రిష్ణానగర్ మీదుగా మచిలీపట్నానికి చేరిన కథకు ముగింపు పడింది. అయితే ఈ లీకేజీ వెనక పెద్దవాళ్ల అండ ఉందని, ఇది ఓ కుట్రలో భాగమే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more