ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరిక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయాలని ఇటీవల వ్యాఖ్యలు చేసిన తెరాస ఎమ్మెల్యే హరీశ్వర్‌రావు జాగ్రత్తగా ఉండాలని, లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలు అయన దిగజారుడు తనానికి నిదర్శమని, ఆయన చదువుకున్న మూర్ఖుడని విమర్శించారు. కొత్తపేటలోని ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం పాత్రికేయులతో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావు రెచ్చగొట్టిన వ్యాఖ్యల వల్లనే వైఎస్సార్ విగ్రహాలను ద్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పురిగొలిపి అసాంఘిక చర్యలకు రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బాద్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన హారీష్‌రావు ఈ విధంగా రెచ్చగొట్టడం ఆయన స్థాయికి తగదని సుధీర్‌రెడ్డి అన్నారు. ఇరుప్రాంతాల ప్రజల మనోభావాలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా తగిన బుద్ది చెప్పడం తప్పదని దేవిరెడ్డి సుధీర్రెడ్ది హెచ్చరించారు. తెరాస కార్యకర్తలను మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజక వర్గాలలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కల సాకారమైన తరుణంలో ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం శోచనీయ మని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా క్టర్ వై.ఎస్. రాజ శేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచు కున్న ఆరాద్య దైవమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గుర్తుచేశారు. ఇరు ప్రాంతాల ప్రజల బావోద్వేగాలను గాయపరచకుండా కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపైన ఉందని, ఎటువంటి దుందుడుకు చర్యలకు ఎవరు పాల్పడినా కాంగ్రెస్కార్యకర్తలు సహించబోరని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more