Bonalu celebrated in golconda

Bonalu in Golconda, Bonalu festival, Golconda Fort, Bonalu in Telangana, Bonalu in Rayalaseema, Bonalu means Bhojanalu, Mysamma, Poleramma, Nookalamma, Yellamma

bonalu celebrated in Golconda

గోల్కొండ కోటలో బోనాలు వేడుకలు

Posted: 07/15/2013 10:58 AM IST
Bonalu celebrated in golconda

నిన్న ఆదివారం గోల్కొండ కోటలో బోనాలు మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  హైద్రాబాద్ సికిందరాబాద్ లలో నెలంతా సాగే బోనాలు పండుగ జంట నగరాల్లో 1813 నుంచి వస్తోంది.  బోనాలు పండుగను ఆషాడమాసంలో జంట నగరాలతో పాటు కొన్ని తెలంగాణా రాయలసీమ ప్రాంతాలలో కూడా చేసుకుంటారు. 

ఈ పండుగలో అన్ని వయసులవారూ ఉత్సాహంగా పాల్గొనటం విశేషం.  మైసమ్మ, పోచమ్మ, నూకాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ మొదలైన దేవతలకు బోనాలు సమర్పించి వేడుక చేసుకోవటమే ఈ పండుగలో పాటిస్తూ వస్తున్న ఆచారం.

బోనాలు అనేది భోజనాలకు వికృతి.  కుండల్లో పాలతోను, పంచదార తోనూ కొన్ని చోట్ల ఉల్లిపాయలు వేసి అన్నాన్ని ఉడికించి అమ్మవారికి నైవేద్యం చేస్తారు.  ఈ వేడుకలో కొత్త బట్టలు వేసుకుని, కొందరు ఔత్సాహికులు రకరకాల వేషధారణతో నృత్యాలు చేస్తూ వస్తారు.  కొందరు ఇళ్ళల్లో చేసుకుంటే మరి కొందరు ఆయా దేవతల గుడిలోనే వంటవార్పులు చేసి అందరూ ఆరగించటం కూడా చేస్తుంటారు.  అందులో మాంసాహారం కూడా ఉంటుంది.  కొన్ని కుటుంబాల్లో మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా కల్లు సేవిస్తారు.

1813లో మొదలైనప్పుడు ఈ వేడుక అమ్మవారికి మహామారి నుంచి కాపాడినందుకు కృతజ్ఞతగా నైవేద్యం పెట్టటం చేసారు.  బోనాలు లోని పదార్థాలు శరీరానికి చలువ చేసేవి ఉంటాయి.  శరీరం మీద వేడి వలన వచ్చే పొక్కులను అమ్మవారు వచ్చింది అని అనటం పరిపాటి.  మశూచికం వంటి వ్యాధులు వచ్చినప్పుడు దాన్ని అమ్మవారి ఆగ్రహంగా పరిగణించేవారు.

వేసవిలోని వేడి తర్వాత ఒక్కసారే వర్షం పడ్డప్పుడు శరీరం లేని వేడి ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు చర్మం మీద వివిధ రకాల పొక్కుల రూపంలో బయటపడే అవకాశం ఉంది కాబట్టి చలువ చేసే పదార్థాలు తినటం అవసరమన్న అభిప్రాయంతో ఈ ఆచారాన్ని ప్రారంభించివుంటారని పెద్దలు అంటారు.  అయితే భక్తిలోంచి పరివర్తన చెంది అది వేడుకగా మారేటప్పటికి ఆయా ప్రాంతాలలో ఉండే ఆచారాల ప్రకారం వేడుకలలో ఆయా అంశాలు చోటుచేసుకున్నాయి. 

కారణమేదైతేనేం, పండుగ అంటేనే ఆనందం, ఆహ్లాదంతో పాటు అందరితో కలిసి గడపటం కాబట్టి ఏ పండుగకైనా పరమార్ధం అదే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more