Gade venkat reddy join in ysr congress party

gade venkat reddy join in ysr congress party, congress party, mla gade venkat reddy, ysr congress party, ys jagan, jagan-ysr, congress party senior leaders, samakyandhra, telangana issue, congress high commend,

gade venkat reddy join in ysr congress party

మనసు జగన్ పార్టీ పై మళ్లింది? కాంగ్రెస్ సీనియర్ లీడర్

Posted: 07/09/2013 12:22 PM IST
Gade venkat reddy join in ysr congress party

కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఆటలో.. తె-నేతలు, -నేతలు పావులుగా మారిపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రోడ్ మ్యాప్ ను తెరపైకి తెచ్చి, రాష్ట్ర రాజకీయ నాయకుల మద్య కొత్త చిచ్చు పెట్టింది. ఈ రోడ్ మ్యాప్ విషయం, రాష్ట్ర విభజనకు దారితీస్తుందనే ఉద్దేశం, రాష్ట్ర రాజకీయ నాయకులు మద్య బలంగా నాటుకుంది. దీంతో కొంత మంది సీనియర్ రాజకీయ నాయకులు వారి మనసును పాడు చేసుకుంటున్నారు. సీనియర్ నాయకులు గోడదూకే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాదే వెంకటరెడ్డి ఉన్నారు. సమైక్యవాదమే నా ఊపిరి అనే నినాదం గట్టిగా కాంగ్రెస్ హైకమాండ్ వినిపించిన నాయకుడు గాదే. అయితే గాదే మనసు మారిపోయింది. గాదే మనసు కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తుంది.

గాదే మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ పార్టీలోకి చేరటానికి గాదే వెంకటరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెసు అధిష్టానం వైఖరి పట్ల ఆయన మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దాంతో ఆయన తన పార్టీ సభ్యత్వానికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయవచ్చునని వినికిడి. అయితే, పరిస్థితి సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉండడం ఆయనకు మింగుడు పడడం లేదని అంటున్నారు. గతంలో సమైక్యవాదం వినిపించిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మంత్రి పదవులు రాగానే తెలంగాణ సమస్యపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటన చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గాదె వెంకటరెడ్డి శాసనసభలో సీనియర్ శాసనసభ్యుడు. అయినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి దక్కకపోవడంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more