హీరో రవితేజ బలుపు పై బాలయ్య ఫైర్ అయినట్లు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బలుపు సినిమాలో బాలయ్యను రవితేజ ఇమిటేట్ చేసినట్లుగా బాలయ్య అభిమానులు , రవితేజ బలుపు పై కొత్త వివాదం తెరలేపారు. అయితే బాలయ్యను రవితేజ నిజంగానే ఇమిటెడ్ చేసి ఉంటాడు అనే అనుమానం, సినిమా చూడని, సినీజనాలకు కలుగుతుంది. ఎందుకంటే గతంలో ఈ ఇద్దరు ఒక హీరోయిన్ కోసం గొడవపడిన సందర్బంలో రవితేజపై బాలయ్య చెయ్యి చేసుకున్నాడనే పుకార్లు టాలీవుడ్ లో నిండుగా ఉన్నాయి. ఆ కోణంలో చూస్తే .. రవితేజ బాలయ్యపై సెటైర్లు వేసే ఉంటాడని సినీ వర్గాలు బలంగా అంటున్నాయి. ఈ వివాదం విషయం తెలుసుకున్న రవితేజ భయంతో ..వెంటనే రంగంలోకి దిగి బలుపు సినిమా దర్శకుడు మలినేని గోపిచంద్ పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ‘బలుపు చిత్రంలో బాలకృష్ణను అనుకరించే విధంగా ఎలాంటి డైలాగులు లేవు, నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానిని, బలుపు చిత్రంలోని ఏ సీన్‌ను నెగెటివ్ కోణంలో చూడొద్దు' అంటే బలుపు సినిమా దర్శకుడు మలినేని గోపిచంద్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.
‘‘సినిమాలోని ఓ సీన్లో రవితేజను హీరోయిన్ అంజలి...తమ హాస్పటిల్ లో రోగుల మనసు మార్చేందుకు స్పీచ్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు రవితేజ..పదానికి పదానికి లింక్ లేకుండా, తడబడుతూ బాలకృష్ణ రియల్ లైఫ్ లో మాట్లాడే విధంగా డైలాగ్ చెబుతాడు’’. ఈ డైలాగ్ కు థియోటర్ లో సినీజనాలు బాగా ఎంజయ్ చేశారు. ఈ డైలాగు బాలకృష్ణను ఉద్దేశించినట్లు ఉందని, బాలయ్య అభిమనాలు ఈ వాదనను తెరపైకి తెచ్చారు. రవితేజ బలుపు పై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించి అలాంటి ఉద్దేశ్యం తమకు లేదని వివరణ ఇచ్చి ఈ వివాదం పెద్దది కాకుండా మొగ్గలోనే తుంచేసారు. వివాదం సమాసిపోవటంతో.. రవితేజ ఊపీరిపిల్చుకున్నారని టాలీవుడ్ సమాచారం. దర్శకుడు గోపీచంద్ వలన బాలయ్య మరో చెంప దెబ్బ నుండి రవితేజను దర్శకుడు గోపీచంద్ తప్పించారనే జోకులు టాలీవుడ్ లో పేలుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more