Hidden treasure in palakollu pancharama kshetram

treasure in pancharamam, palakollu pancharama kshetram, Ksheera Lingeswara Swamy, gold coins under dhwaja stambham

hidden treasure in palakollu pancharama kshetram

ఆలయంలో బయటపడ్డ నిధి

Posted: 06/02/2013 04:59 PM IST
Hidden treasure in palakollu pancharama kshetram

పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరలింగేశ్వరస్వామి ధ్వజస్తంభం కింద పురాతనమైన బంగారు, వెండి, రాగి నాణేలతో కూడిన నిధులు లభించాయి. 

పడిపోయిన స్థానంలో మరో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించటానికి చేస్తున్న పనులలో సామాన్యంగా ధ్వజస్తంభం కింద పెట్టే మంత్రబద్ధమైన యంత్రంతో పాటు నిధులు కూడా లభించాయి.  పోయిన సంవత్సరం ధ్వజస్తంభం కూలిపోవటాన్ని అరిష్టానికి చిహ్నంగా భావించారు.  కానీ వాటి కింద పొందుపరచిన నిధులు బయటపడే సమయం వచ్చిందన్నమాట.

ఇప్పుడున్న బ్యాంక్ వ్యవస్థలు, కట్టుదిట్టమైన హుండీ నియంత్రణలు లేని కారణంగా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఆ విధంగా నిక్షిప్తం చేసివుంటారని పెద్దలు భావిస్తున్నారు.  నిధి విలువను లెక్కిస్తున్న పురావస్తు అధికారులు ఆ పని పూర్తయిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అన్నారు. 

ఆలయాన్ని బట్టి వివిధ రకాల యంత్రాలను ధ్వజస్తంభం కింద పెట్టి ఆ తర్వాత మంత్రబద్దంగా ప్రతిష్ట చేస్తారు.  క్షీరలింగేశ్వర స్వామి ధ్వజస్తంభం కింద కూర్మ యంత్రం కనిపించింది. 

కానీ ఈ వార్త నిధి నిక్షేపాల కోసం ఆలయాలలో దొంగతనంగా తవ్వకాలను సాగించేవారికి మరోసారి ఆశ కల్పించే అవకాశం ఉంది కాబట్టి పురాతన ఆలయాల పరిరక్షణను పటిష్టం చెయ్యాలని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more