Gold loans and bank withdrawals increased in gold rush

gold prices came down, gold rush increased, bank loans and withdrawals to buy gold,

gold loans and bank withdrawals increased in gold rush

బంగారం తాకట్టు పెట్టి బంగారం కొనుగోలు

Posted: 04/21/2013 05:35 PM IST
Gold loans and bank withdrawals increased in gold rush

 

 

 

ఏది మంచిదో దాన్నే బంగారం అంటారు.  ఏది ఎక్కువ ప్రయోజనకారో దాన్ని బంగారం అంటారు.  ఎక్కువ ఇష్టపడేదాన్ని బంగారం అంటారు.  మంచి మనిషిని, ఇష్టపడే మనిషిని బంగారం అంటారు.  లోహాలక్షణాలలో అంతకంటే ఎక్కువ మంచి గుణాలున్న టైటానియమ్ కంటే బంగారానికే ఎక్కువ మోజు చూపించటానికి కారణం దాని పచ్చటి రంగు మిలమిలకు మనం అలవాటు పడటం. 

అటువంటి బంగారం ధర పడిపోవటంతో లాభసాటి పెట్టుబడిగా తీసుకుని తమ డబ్బుని బంగారంలోకి మార్చుకోవటానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు- పడిపోవటమంటే అత్యధికంగా పెరిగిన రేటుకంటే కొద్దిగా పడిపోవటం!   బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపోజిట్లలో ఉన్న సొమ్ముని కూడా తీసి బంగారం కొనుగోలుకి ఉపయోగించటానికి సిద్ధపడుతున్నారు.  ఫిక్స్ డ్ డిపాజిట్ లోంచి మధ్యలో తీసేస్తే నష్టం 1 శాతమే కానీ బంగారు కొనుగోలు చేస్తే ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇదో మంచి లాభసాటి, తక్కవ సమయంలో ఎక్కువ ప్రయోజనం కలిగించే పెట్టుబడి అవుతుందని చాలామంది నమ్ముతున్నారు, బ్యాంకులకు పరిగెడుతున్నారు. 

దీనంతటికీ కారణం కొన్ని నెలల క్రితం 10 గ్రాముల 22 కారట్ల బంగారం 31000 రూపాయలకు చేరుకుని ఒక్కసారిగా 25500 కి దిగింది.  ఇంకా తగ్గుతుందేమో చూద్దామనుకునేవాళ్ళు తక్కువే ఉన్నారు.  ఎలాగూ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే కొనుగోలు చెయ్యటమే మంచిదనుకునేవారే ఎక్కవ మంది కనపడుతున్నారు.  కొంత మంది ఉన్న పాత బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టి మరీ కొత్త బంగారాన్ని కొనుగోలు చెయ్యటానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.  దీనితో బ్యాంక్ ల్లో చెల్లింపులు కౌంటర్ బిజీగా పనిచెయ్యటం మొదలుపెట్టింది.  9 నుంచి 12 శాతం వరకు వడ్డీ మీద ఇచ్చే బంగారం మీద ఋణాలు, వ్యవసాయం ద్వార వచ్చిన సొమ్మని ఋజువులు చూపిస్తే 7.5 శాతమే వడ్డీ వేస్తారు. అందువలన, అంతకంటే ఎక్కువ లాభమే పొందవచ్చన్న ఉద్దేశ్యంతో బంగారం తాకట్టు పెట్టి బంగారం కొనేవారి సంఖ్యకూడా ఎక్కవైంది.

అయితే బ్యాంకులకుండే లెక్కలు బ్యాంకులకుంటాయి.  అంతకుముందు 10 గ్రాములకు 22000 వరకు అప్పు ఇచ్చే బ్యాంకులు ఇప్పుడు 18000 మాత్రమే ఇవ్వటానికి సిద్ధపడుతున్నాయి.  జాగ్రత్తగా మార్కెట్ రేట్ లో 65 శాతం మాత్రమే బంగారం మీద ఋణాలు ఇవ్వమని ప్రభుత్వ బ్యాంక్ శాఖలకు వారి ప్రధాన కార్యాలయాలనుండి ఆదేశాలు వెళ్ళాయి.  కానీ ప్రైవేటు బ్యాంక్ లు మాత్రం 90 శాతం ఇస్తామని ఇప్పటికీ అంటున్నాయి. 

బంగారం రేటు పడిపోవటం స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుందని విశేషకులు అభిప్రాయపడుతున్నారు. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more