చోర్ బజార్ పేరు విననివారుండరు కానీ చోర్ బజార్ అనుభవం చాలా తక్కువమందికుంటుంది. పేరుకి తగ్గట్టుగానే అది దొంగ సామాన్లను అమ్మే స్థలం. పది వేల రూపాయల విలువైన వస్తువుని 100 రూపాయల నుంచీ బేరం చెయ్యవచ్చు. అమ్మే వాళ్ళ ఇష్టాన్నిబట్టి ఎంతకైనా ఇచ్చెయ్యవచ్చు. ఏ వ్యాపార నియమాలూ లేని స్థలమది. ఎటువంటి గ్యారెంటీలూ ఉండవు. ఎవరి దగ్గరున్న వస్తువు వారిదే. మీరు అప్పుడే కొనుక్కుని పక్కన పెట్టుకుని మరో వైపు తిరిగితే దాన్ని మరెవరో అమ్మేస్తారు. ఎవరి ఆధీనంలో ఉన్నది వారి వస్తువు అంతే. కరెన్సీ లా ఎవరి జేబులో ఉన్న డబ్బు వారిదే అన్నట్టు ఉంటుంది. ఒకతను పెద్ద టేబుల్ కొనుక్కుని లారీ మీద ఎక్కిద్దామనుకున్నాడు. ఇంతలో మరొకడు సాయం పట్టటానికి వచ్చినట్టుగా వచ్చి లారీ మీద ఎక్కించాడు. అంతే ఆ టేబుల్ అతనిదైపోయింది. చేతిలో ఉన్న వస్తువుని కూడా గట్టిగా ఎవరూ లాక్కోకుండా పట్టుకోవాలి. ఇదీ చోర్ బజార్ దృశ్యం.
అయితే అటువంటి చోర్ బజార్ నుంచి అమీర్ ఖాన్ కోసం ఒక వస్తువు కొనుగోలు జరిగిందంటే నమ్ముతారా. కానీ జరిగిందదే. హిందీ ప్రఖ్యాత నటుడు అమీర్ ఖాన్ ఏది చేసినా వాస్తవానికి దగ్గర్లో ఉండేట్టుగా చూసుకుంటాడు. మేకప్ కానీ, దుస్తులు కానీ, వస్తువులు కానీ, ముఖంలో హావభావాలు కానీ అన్నీ సరిగ్గా సరిపోవాలి. దానితోపాటు చక్కటి డైలాగ్స్ ని ఇంకా చక్కగా చెప్తాడు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతాడు. 44 సంవత్సరాల వయసులో కాలేజ్ విద్యార్థిగా వేషం కట్టి ప్రేక్షకులను అలరించాడు.
ఇంతకీ చోర్ బజార్ లో కొన్న ఆ వస్తువేమిటంటే- ఒక పాత రేడియో! ఎఫ్ ఎమ్ లు వచ్చి ఫోన్ లలోనే పాటలు వినగలుగుతున్నప్పుడు, అంత పెద్ద హీరోకి పాత రేడియో ఏమిటి, అది కూడా చోర్ బజార్ మాల్ అవటమేమిటని ఆశ్చర్యపోతున్నారా?
రాజస్తాన్ లో రాజ్ కుమార్ హీరానీ చిత్రంలో జరుగుతున్న షూటింగ్ లో అమీర్ ఖాన్ ధరించిన పాత్ర దృష్ట్యా అతని చేతిలో పాత రేడియో ఒకటి ఉండాలి. వివిరించినదాని ప్రకారం ప్రొడక్షన్ యూనిట్ కి అటువంటి రేడియో ఎక్కడా దొరకలేదు. ఎక్కడా దొరకనిది చోర్ బజార్ లో దొరుకుతుందన్నట్టు అమీర్ ఖాన్ పాత్రకు కావలసిన రేడియోని అక్కడి నుంచే కొని తీసుకొచ్చారు చిత్రనిర్మాణ బృందంవారు. ఆ రేడియోతో, విచిత్ర వేషధారణతో మీడియా కేమెరాకు చిక్కారు అమీర్ ఖాన్!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more