Mla akbaruddin owaisi arrested by nirmal police

akbaruddin arrest, akbaruddin hate speech, akbaruddin health report, akbaruddin goes hyderabad to nirmal, hyderabad heavy security, mla akbaruddin owaisi, akbaruddin owaisi arrested

mla akbaruddin owaisi arrested by nirmal police

mla akbaruddin owaisi arrested.gif

Posted: 01/08/2013 06:29 PM IST
Mla akbaruddin owaisi arrested by nirmal police

mla akbaruddin owaisi arrested by nirmal police

కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో కలిసి హైదరాబాద్‌లో సమస్యలు సృష్టించేందుకు కుట్రలు చేస్తోందని వాటిని 24, 25 తేదీల్లో బట్టబయలు చేస్తామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం బీజేపీతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో సమస్యలు సృష్టించేందుకు కుట్రలు చేస్తోందని ఇక్కడ ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో సుమారు మూడు గంటల పాటు ఐదుగురు వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అక్బరుద్దీన్ రాక సందర్భంగా పోలీసులు గాంధీ ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అక్బరుద్దీన్ శరీరంలో ఒక తూటా ఉందని, అందువల్ల ఆయనకు ఎం.ఆర్.ఐ పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని డాక్టర్లు తెలియజేశారు. అవిచారణకు అక్బర్ 'ఫిట్' గా ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేస్తే ఆస్పత్రి నుంచి నిర్మల్ కు తరలిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - నిర్మల్ మార్గమధ్యలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎం.ఐ.ఎం. శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని పోలీసులు అరెస్టు చేశారు. అక్బరుద్దీన్‌కు గాంధీ ఆస్పత్రిలో మొత్తం ఎనిమిది రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు జరిగిన అనంతరం అక్బరుద్దీన్ ఇంటికి వెళ్లిపోతాననడంతో వైద్య నివేదిక వచ్చేవరకూ ఆస్పత్రిలోనే ఉండాలని పోలీసులు సూచించారు.  మొత్తం ఐదుగురు ప్రభుత్వ వైద్యులతో కూడిన బృందం గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని ధ్రువపరుచుకున్న అనంతరమే అక్బరుద్దీన్‌ను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ఆయనకు తెలియజేశారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని చర్యలూ చేపట్టారు.

mla akbaruddin owaisi arrested by nirmal police

అయితే తనకు పొత్తి కడుపులో నొప్పిగా ఉందంటూ, తనను ఇంటికి వెళ్లిపోవడానికి అనుమతించాలని అక్బరుద్దీన్ పోలీసులను కోరారు. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని పోలీసులు అక్బరుద్దీన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వారితో వాగ్వాదానికి దిగారు.  నమోదైన కేసుల విషయంలో పోలీసులకు సహకరించవలసిందేనని పోలీసు అధికారులు అక్బరుద్దీన్‌కు గట్టిగా చెప్పడంతో తాను అనారోగ్యంగా ఉన్నానని, సహకరించడానికే లండన్‌నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చానని ఆయన పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తున్నది. మీ ఆరోగ్యం గురించి మాకు కూడా ఆందోళనగానే ఉంది కాబట్టే అస్పత్రిలో వైద్యులతో అన్ని పరీక్షలూ నిర్వహిస్తున్నామని పోలీసులు ఆయనకు వివరించారు.  అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేస్తారని ముందుగానే సమాచారం ప్రచారంలోకి రావడంతో ఎం.ఐ.ఎం. కార్యకర్తలు గాంధీ ఆస్పత్రివద్ద ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం వారు ముషీరాబాద్‌లో ఆర్.టి.సి. బస్సులపై దాడికి పాల్పడడంతో ఒక బస్సు అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు పరిస్థితిని అదుపుచేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ముషీరాబాద్‌లో దుకాణాలను మూయించేశారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎవ్వరూ గుంపులు గుంపులుగా సంచరించరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అఫ్జల్ గంజ్, దారు సలామ్ తదితర ప్రాంతాలలో పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. వరంగల్ రీజియన్ ఐ.జి. వేంకటేశ్వరరావు గాంధీ ఆస్పత్రిలో అక్బరుద్దీన్‌తో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చర్చిస్తున్నారు. నిర్మల్ సి.ఐ. కూడా అక్కడే ఉన్నారు. పరిస్థితి ఎట్టి పరిస్థితులలోనూ చేజారకుండా చూడడానికై పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ దారి పొడవునా పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak troops kill two jawans behead mutilate one of them
Ed attaches rs 143 crore assets of jaganmohan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more