ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలకు మధ్య కోల్డ్ వార్ ప్రభావం మెదక్ జిల్లాలో జరిగే ఇందిరమ్మబాటపై పడే అవకాశం కనిపిస్తుంది. ఈనెల 29 నుంచి 31 వరకు సీఎం పర్యటన ఖరారు చేసేందుకు హైదరాబాద్ లో జిల్లా ఇంచార్జిమంత్రి డీకే అరుణ సమావేశం ఏర్పాటు చేయగా ఉపముఖ్యమంత్రి హాజరుకాలేదు. దీంతో జిల్లాలో ఇందిరమ్మబాట ఎలా జరుగుతుందనే దానిపై సర్వత్ర చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి చేపట్టిన ఇందిరమ్మబాట మెదక్ జిల్లాలో ఈనెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించేందకు అధికారులు పార్టీనేతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై సీఎం కిరణ్ ఇంచార్జి మంద్రి డికె అరుణకు బాధ్యత అప్పగించారు. మంత్రి డీకే అరుణ సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ విప్ జగ్గారెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉన్నప్పటికి ఆయన దూరంగా ఉన్నారు. అటు మంత్రులు గీతారెడ్డి సునితా లక్ష్మారెడ్డి కూడా వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేదు. జిల్లాలో అక్టోబర్ నెలలోనే ఇందిరమ్మబాట నిర్వహించాల్సి ఉన్నా సెప్టెంబర్ 30న జేఏసీ నిర్వహించిన హైదరాబాద్ మార్చ్ జరగడంతో సీఎం పర్యటన వాయిదా పడింది. అప్పటి పరిస్థితులపై ప్రభుత్వం అనుసరించిన తీరును దామోదర తప్పుబట్టి కిరణ్ కుమార్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ నేతలపై సీఎం వివక్షత చూపుతున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు అక్టోబర్ లో నిర్వహించాల్సిన ఇందిరమ్మబాటపై మంత్రి గీతారెడ్డి కూడా అసహనం వ్యక్తం చేశారు. జేఏసీ నిర్వహించిన మార్చ్ జరిగిన వెంటనే జిల్లాలో సీఎం పర్యటిస్తే తెలంగాణ వాదుల నుంచి నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉందనే దానిపై ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పడంతో చివరి క్షణాల్లో సీఎం పర్యటన రద్దయ్యింది. మరోవైపు ఉపముఖ్యమంత్రి సమావేశానికి హాజరుకాకపోవడంతో ఆయన నియోజకవర్గం ఆందోల్ మినహా జిల్లాలోని మిగితా తొమ్మిది నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం సీఎం వెంట ఉపముఖ్యమంత్రి కూడా జిల్లా పర్యటనలో తప్పని సరిగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందిరమ్మబాటకు దామోదర దూరంగా ఉంటే ఇరువురి మధ్య నెలకొన్న విభేదాలు ఢిల్లీ వరకు చేరే అవకాశం ఉందని ఈ తరుణంలో సీఎం పర్యటన ఈసారైనా ఉంటుందా...? లేదా అనే దానిపై పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more