బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాక్ సమరం తీవ్ర రూపం దాల్చింది. దక్షిణాదిన తొలిసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీజేపీ కార్యకర్తల, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి డి.వి.సదానందగౌడ ఆరోపించారు. గతనాలుగేళ్ళ పాలనలో అడుగడుగునా అవినీతి, అక్రమాలు, స్వజన పక్షపాతం, కులరాజకీయాలు విలయతాండవం చేశాయంటూ పరోక్షంగా మరో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై చురకలు వేశారు. కర్ణాటక రాజకీయ పరిస్థితిపై పార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వాని తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలను సదానందగౌడ పూర్తిగా సమర్థించారు. అవినీతి రహిత, పారదర్శక పాలన మొదటి మూడేళ్ళ ప్రభుత్వం దారి తప్పిందని అయితే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగానే ఉన్న పదవి కాస్తా ఊడిందని సదానందగౌడ వ్యాఖ్యానించారు. సదానందగౌడ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సదానందగౌడ తన నోటిని అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more