త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.25 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని సూరత్‌లో అంబులెన్స్‌లో తరలిస్తున్న ఈ నకిలీ నోట్ల తరలింపుపై పక్కా సమాచారం అందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై-అహ్మదాబాద్ రోడ్డు రూ 25 కోట్ల ఫేస్వ్యాల్యూతో కూడిన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్ వాహనంలో నకిలీనోట్లను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకోవడంతో దానిని అడ్డగించిన పోలీసులు వాహనం నుంచి నకిలీ ఇండియన్ కరెన్సీని సీజ్ చేశారు.
ఆరు బాక్సుల్లో 1290 బండిల్స్‌లో నోట్లను తరలించడాన్ని పోలీసులు కనుగొన్నారు. సూరత్‌లోని కమ్రేజ్ ప్రాంతంలో అంబులెన్స్‌ను పోలీసులు నిలిపివేశారు. రూ 2000 నోట్లతో నకిలీ కరెన్సీని తరలిస్తుండగా వీటిపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్నాయి. ఇక దాని కింత కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేందుకు మాత్రమే అని కూడా రాసిఉంది. అయితే నిజంగా అలా అయితే పోలీసుల సమ్మతి తీసుకుని ఏకంగా ఏదైనా ట్రక్కులో తరలించే బదులు.. అంబులెన్స్ లో తరలించాల్సిన అవసమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పోలీసుల కళ్లు గప్పి.. అంబులెన్సులో నకిలీ నోట్ల చలామణి చేయాల్సిన అవసరం ఏంటన్న కోణంతో పాటు ఎవరు వీటిని ముద్రించారన్న కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంబులెన్స్‌పై ఒక భాగంలో దిక్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్-సూరత్ అని రాసి ఉండగా మరో వైపు గో మాత రాష్ట్ర మాత అని రాసి ఉంది. ఈ నోట్లను ఎక్కడ ముద్రించి ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనేది అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నామని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని ఎస్పీ హితేష్ జోసర్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్ధలానికి చేరుకుందని అధికారులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more