1000 Days For Amaravati Farmers Agitation అమరావతి రైతుల పాదయాత్రపై ట్వీట్.. మంత్రిపై నెటిజనుల విమర్శలు..

Amaravati farmers protest 1 000 days 2nd phase of march begins with arasavalli temple padyatra

farmers, amravati, farmers protest, amaravati farmers padayatra, amaravati - arasavelli, Amravati, farmers, march, farmers protest, farmers pressure, Jagan Mohan Reddy, tri-capital, minister ambati rambabu, twitter, netizens, Andhra Pradesh, politics

To give more momentum to farmers’ 1,000-day-long-movement on creating awareness among the people across the state on the necessity of the formation of Amaravati as a capital, agitated farmers from the area launched the second phase of the massive foot march from Venkatapalem on Monday.

అమరావతి రైతుల పాదయాత్రపై ట్వీట్.. మంత్రిపై నెటిజనుల విమర్శలు..

Posted: 09/12/2022 06:39 PM IST
Amaravati farmers protest 1 000 days 2nd phase of march begins with arasavalli temple padyatra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ ఆయా ప్రాంత రైతులు ఇవాళ్టి నుంచి మరో విడత మహాపాద్ర చేపట్టిన విషయం తెలిసిందే. అమరావతి సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల రైతులు.. గతంలో తిరుమల తిరుపతికి పాదయాత్రగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని తిరుపతిలో సభ ఏర్పాటు చేసుకుని తిరుగు పయనమైన రైతులు తాజాగా మరోమారు పాదయాత్ర చేపట్టారు. వారి పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ట్విట్టర్‌ వేదికగా పాదయాత్రను కాస్తా ఫేక్‌ యాత్రగా అభివర్ణించారు. దాంతో మంత్రి అంబటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా నెటిజెన్లు అంబటిపై తీవ్ర విమర్శలు చేస్తూ కౌంటర్‌ ఇస్తున్నారు.

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనాసాగించాలనే డిమాండ్‌తో రైతులు గతంలో కూడా మహా పాదయాత్ర చేపట్టారు. కాగా, వారు చేపట్టిన ఆందోళనకు 1000 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో విడత మహాపాదయాత్రకు పూనుకున్నారు. రైతుల పాదయాత్రపై ఆగ్రహంతో ఉన్న మంత్రి అంబటి రాంబాబు.. ట్విట్టర్‌ వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ‘అది మహా ఫేక్‌ యాత్ర’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఆ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి రాస్తున్నట్లు వెల్లడించలేదు.

మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌పై నెటిజెన్లు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేస్తున్న పాదయాత్రపై ఇలా మంత్రి తన అక్కసును వెళ్లగక్కడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జగన్‌ చేపట్టిన పాదయాత్రను ఏమంటారు అంబటి? అంటూ ప్రశ్నించారు. డైలాగులు చెప్పమంటే భలే చెప్తారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల గురించి నీ బాధ మొసలికన్నీరేనా అని నిలదీశారు. కాగా, రైతుల మహా పాదయాత్రపై మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా తీవ్రంగా స్పందించారు. గురజాడ బతికుంటే రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయ్‌.. 26 జిల్లాలోయ్‌ అనే వారేమో అంటూ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles