Andhra HC questions release of life convicts ‘సుప్రీం’ మార్గదర్శకాలు పాటించకుండా ఖైదీల విడుదలా.?: హైకోర్టు

Andhra pradesh high court questions release of life convicts

prisoners release, ap high court, Andhra Pradesh High Court, Independence Day, august 15, court questions govt orders, murder case accused, Supreme Court Guidelines, Justice Ch Manavendranath Roy, M Navaneethamma, Mettu village, Chittamuru mandal, Nellore district, Andhra Pradesh, Crime

The Andhra Pradesh High Court sought to know as to how it can release prisoners, who were sentenced for 14 years of life imprisonment, before they have completed their term. The Supreme Court has clearly stated that life convicts, who have undergone 14 years of imprisonment are only eligible for remission. Justice Ch Manavendranath Roy made these observations while hearing a petition filed by M Navaneethamma of Mettu village in Chittamuru mandal of Nellore district.

‘సుప్రీం’ మార్గదర్శకాలు పాటించకుండా ఖైదీల విడుదలా.?: హైకోర్టు

Posted: 08/23/2022 01:39 PM IST
Andhra pradesh high court questions release of life convicts

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను క్షమాభిక్ష ప్రసాదించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ఈ క్షమాభిక్ష పేరుతో కొందరు ఖైదీలు తమ శిక్షాకాలం ముగియకుండానే బయటకు రావడంపై గతంలోనే వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఖైదీల విడుదలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే వాటిని తొసిరాజుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షాకాలం ముగియని ఖైదీలను కూడా విడుదల చేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుల్ని విడుదల చేయడమేంటని ప్రభుత్వాన్ని రాష్ట్రోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలను విడుదల చేశారంటూ హత్యకు గురైన మృతుడి భార్య నవనీతమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన యావజ్జీ శిక్ష పడిన దోషులను శిక్ష పూర్తికాకుండానే ఎలా విడుదల చేశారని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగూణంగా క్షమాభిక్ష ప్రసాదించకుండా అతిక్రమణలకు పాల్పడతారా అని ప్రశ్నించింది. హత్యకేసులో జీవిత ఖైదు పడిన నిందితులకు కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి కాకుండా విడుదల చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఖైదీల విడుదలలో ఉన్న నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఖైదీలను ఎలా విడుదల చేశారని నిలదీసింది. కనీసం 14 ఏళ్ల జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్న వారిని మాత్రమే క్షమాభిక్షకు అర్హులుగా గుర్తించాల్సి ఉన్నా, యావజ్జీవ శిక్ష పూర్తికాని ఖైదీలను ఎంచుకుని మరీ వారి శిక్షను కుదించి విడిచిపెట్టడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను న్యాయస్థానం ఎదుట ఉంచాలని ఆదేశించింది. కాగా, ప్రభుత్వం తరపు న్యాయవాది గవర్నర్ అమోదం మేరకు ఖైదీల విడుదల జరిగిందని.. ఈ ప్రక్రియ అనవాయితీ ప్రకారం వస్తోందని తెలిపింది.

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన పార్థమరెడ్డిని హత్య చేసిన ఎనిమిది నిందితులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై విడుదల కావాడాన్ని సవాలు చేస్తూ మృతుడి భార్య ముడి నవనీతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ విచారణ జరిపారు. గత ఏడాది నిందితులు విడుదల అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో హైకోర్టు అభ్యంతరంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది బయటకు రావడంతో తిరిగి కోర్టును ఆశ్రయించారు. ఏడాది తర్వాత నిందితులు పూర్తి శిక్షలను అనుభవించకుండానే బయటకు రావడంపై కోర్టును ఆశ్రయించారు.

గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌కు అనుబంధంగా మరో పిటిషన్ వేశారు. క్షమాభిక్షతో బయటకు వచ్చిన ఎనిమిది మంది నిందితులలో కొందరు ఎనిమిదేళ్లు, మరికొందరు 11ఏళ్లు మాత్రమే శిక్షలు పూర్తి చేసుకున్నారు. దీంతో నిందితుల్ని తిరిగి జైలుకు పంపాలని కోర్టుకు కోరారు. ప్రభుత్వ క్షమాభిక్షపై విడుదలైన పుచ్చలపల్లి నరేశ్‌రెడ్డి, కొండూరు దయాకర్ రెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి, పుచ్చలపల్లి నిరంజన్ రెడ్డి, పుచ్చలపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెన్నూరి వెంకటరమణారెడ్డిలను జైలుకు పంపాలని పిటిషనర్ అభ్యర్థించారు.

కనీసం 14ఏళ్ల శిక్షలు పూర్తి కాకుండా నిందితులకు క్షమాభిక్షలు ప్రసాదించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌ అధికారాల మేరకు ఖైదీల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన హైకోర్టు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించారా లేదా అని ప్రశ్నించింది. జీవిత ఖైదు పడిన వారు కనీసం 14ఏళ్ల శిక్ష అనుభవించాలని,సత్ప్రవర్తన కలిగి ఉంటేనే క్షమాభిక్షకు అర్హులని గుర్తు చేశారు. ఖైదీల విడుదలపై పూర్తి వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని, పూర్తి స్థాయి వాదనలకు సిద్ధమై శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles