Musi river in spate, families on its banks evacuated జంట జలాశయాలకు భారీ వరద.. మూసారాంబాగ్​ బ్రిడ్జి మూసివేత..

Hyderabad musi river in spate families on its banks evacuated

Nayapool flood flow, Musarambhag Bridge closed, Traffic Restrictions, musi river flood water, nayapool in hyderabad, Nayapool flood water flow, musi river, Musi River Overflow, heavy flow from musi to musarambhag bridge, musarambhag bridge traffic diverted, heavy flood flow, musarambhag bridge close, hyderabad floods, musi floods

With nearly 20,000 cusecs of flood water being released from the twin reservoirs of Osman Sagar and Himayath Sagar, Hyderabad’s Musi river continues to flow beyond danger levels. Several low-lying areas along its banks, especially at Chaderghat, Kamalanagar, Shankarnagar and Moosanagar, are inundated. Many families are already being evacuated as the river continues to be in spate. As water has risen over danger levels, Chaderghat and Moosarambagh causeways have been closed and traffic is diverted.

రెడ్ అలర్ట్: జంట జలాశయాలకు భారీ వరద.. మూసారాంబాగ్​ బ్రిడ్జి మూసివేత..

Posted: 07/27/2022 04:28 PM IST
Hyderabad musi river in spate families on its banks evacuated

హైదరాబాద్​లో మూసీ పరివాహక ప్రాంతాల​ను వరద ముంచెత్తింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నుంచి భారీగా నీరు దిగువకు విడుదల చేయడంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలసంద్రంగా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి భారీగా చేరుతున్న వరద నీటితో పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉస్మాన్ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నుంచి భారీగా వరదనీరు దిగువకు వస్తుండటంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సహయక బృందాలు లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

దీంతో మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు పునరావాసాలకు తరలించారు. ఉస్మాన్‌ సాగర్‌ 15 గేట్లకు గాను.. 13 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మరో గేటును సైతం ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. వరదనీరు ఉద్ధృతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లు నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాగా, జంట జలాశయాలకు క్రమంగా వరద ఉద్దృతి తగ్గుతోంది. ఉస్మాన్​సాగర్​ ఇన్‌ఫ్లో 7,500 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 7వేల క్యూసెక్కులు కాగా.. 8 గేట్లు ఎత్తి 7,708 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో బ్రిడ్జిని పోలీసులు మూసివేశారు. బ్రిడ్జి పైనుంచి పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండడంతో నిన్నటి నుంచే రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం వరకు వంతెనపై నుంచి మూసీ వరద కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో అంబర్‌పేట - కాచిగూడ, మూసారాంబాగ్ - మలక్‌పేట మార్గాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చాదర్‌ఘాట్‌, కోఠి రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది.

ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఉద్ధృతంగా ప్రవసిస్తోన్న మూసీతో మూసారాంబాగ్​ లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరిన శంకర్​నగర్, మదర్స ప్రాంతాల్లోని స్థానికులను.. రత్నానగర్, పటేల్​నగర్, గోల్నాక ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు. వర్షం వచ్చినప్పుడల్లా తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని.. శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles