ఇప్పుడంతా డిజిటల్ మీడియా.. ఆన్ లైన్ లోనే షాపింగ్.. ఫుడ్ ఆర్డర్.. క్యాబ్ బుకింగ్స్.. రైల్వే మొదలు బస్సు నుంచి విమానాల వరకు టికెట్ల బుకింగ్ అంతా డిజిటల్‌గానే సాగిపోతూ ఉంటుంది. ఇది ఎంత సునాయాసంగా పనులు చేసిపెడుతుందో.. అప్రమత్తంగా ఉండకపోతే అంతే ప్రమాదకరమని ఇప్పటికే అనేక సందర్భాల్లో చాలామందికి తెలిసి వచ్చింది. జేబులు గుల్లైన తరువాత ఎంత లబోదిబోమని మొత్తుకున్నా.. పోయిన సోమ్ము మాత్రం తిరిగిరావడం చాలాకష్టం. అనితర సాధ్యమనే చెప్పాలి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవం గురించి తెలియని అమాయకులను సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకుంటున్నారు.
రకరకాల లింక్‌లు పంపి బురిడి కొట్టిస్తున్నాయి. ప్రత్యేకించి దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు టాటా సన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల పేరిట ప్రజలను మోసగించేందుకు పూనుకుంటున్నాయి. తాజాగా ఫ్రాడ్‌స్టర్ల జాబితాలోకి టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా (మహరాజా) వచ్చి చేరింది. ఎయిరిండియా 75వ వార్షికోత్సవం సందర్భంగా ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అంటూ బూటకపు మెసేజ్ ప్రజల్లోకి పంపారు సైబర్ మోసగాళ్లు. ఒక క్వశ్చనీర్ (ప్రశ్నావళి)ని పూర్తి చేసిన వారికి విమాణ ప్రయాణ టికెట్లపై రూ.6000 రాయితీ పొందొచ్చునని ఆ బూటకపు మెసేజ్ సారాంశం. వివిధ సోషల్ మీడియా వేదికలపై సదరు మెసేజ్ హల్చల్ చేస్తున్నది.
ఎయిరిండియా 75వ వార్షికోత్సవం పేరిట సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న బూటకపు మెసేజ్‌పై మహరాజా సంస్థ యాజమాన్యం రియాక్టయింది. తమ సంస్థ పేరిట వచ్చే ఫ్రాడ్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను.. ప్రత్యేకించి విమాన ప్రయాణికులకు అలర్ట్ జారీ చేసింది. ఆ లింక్‌ల మాయలో పడొద్దని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిరిండియాను గతేడాది అక్టోబర్ 8న వేలం ద్వారా టాటా సన్స్ గెలుచుకున్నది. ఈ ఏడాది జనవరి 27న లాంఛనంగా ఎయిరిండియాను టేకోవర్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more