మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్ ల్యాండ్ స్కాం కేసులో ఈడీ సంజయ్ రౌత్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సంజయ్ రౌత్‌కు చెందిన ఆస్తులు కొన్నింటినీ ఈడీ అటాచ్ చేసింది. రౌత్‌కు సమన్లు జారీ చేయడం ద్వారా ఈడీ కాషాయ పార్టీ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించిందని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. మరోవైపు రేపు విచారణకు హాజరు కావాలని సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంపై టీఎంసీ మోదీ సర్కార్‌పై విరుచుకుపడింది.
ప్రత్యర్ధులను వేధించడం, విపక్ష సర్కార్లను కూల్చివేయడం వంటి వికృత చర్యలకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీఎంసీ ప్రతినిధి సాకేత్ గోఖలే విస్మయం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉద్థవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బయటకు రావడంతో ఎంవీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిందని షిండే వర్గం సోమవారం పేర్కొంది. డిప్యూటీ స్పీకర్ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించింది.
మరోవైపు రాజ్ ఠాక్రేతో అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తదుపరి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని అసమ్మతి వర్గం నిర్ణయించింది. ఇక రెబెల్ గ్రూపుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని స్పష్టం చేసిన రౌత్ హిందుత్వ కోసం ఎవరు ప్రాణాలు అర్పించారో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్ధిరత నేపధ్యంలో ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె డిమాండ్ చేశారు.
I just came to know that the ED has summoned me.
— Sanjay Raut (@rautsanjay61) June 27, 2022
Good ! There are big political developments in Maharashtra. We, Balasaheb's Shivsainiks are fighting a big battle. This is a conspiracy to stop me. Even if you behead me, I won't take the Guwahati route.
Arrest me !
Jai Hind! pic.twitter.com/VeL6qMQYgr
ప్రవీణ్ రౌత్, పాత్ర చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన ఈ 2007 నాటి కేసులో సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ముఖ్యమంత్రిగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ పని చేస్తున్న సమయంలో నమోదైన ఈ కేసులో.. ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. తాము బాలాసాహెబ్ శివసైనికులమని, ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తున్నామని, ఇది తనను అడ్డుకునే కుట్రని మండిపడ్డారు. ‘నువ్వు నా తల నరికినా.. నేను గౌహతి మార్గంలో వెళ్లను. నన్ను అరెస్ట్ చేయండి.. జై హింద్ అంటూ’ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more