తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే తాను వీడానని, తిరుగుబాటుదారులపై పోరాటాన్ని కాదని శివసేన ఆయన అన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శుక్రవారం శివసేన భవన్‌కు తరలివచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. అధికారంపై తనకు ఎలాంటి ఆశలేదన్నారు.
చచ్చినా సరే శివసేను వీడమని చెప్పిన నేతలు ఇప్పుడు పారిపోయారని విమర్శించారు. శివసేను చీల్చాలని రెబల్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని విమర్శించారు. నిజంగా, ఆ ధైర్యం ఉన్నవారు బాలసాహెబ్, శివసేన పేరు ఎత్తుకుండా ప్రజల్లోకి వెళ్లి ఆ పని చేయాలని సవాల్ విసిరారు. శివాజీ మహారాజ్ ఓడిపోయినా ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం తనను కూడా తస్మదీయులే వెన్నుపోటు పోడిచారని.. అయినా తాము శివసేనను పునర్నిర్మిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన ఆరోగ్యం సహకరించడంలేదని దీంతో తాను సరిగా పని చేయలేకపోతున్నానని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
మెడ, తల బాధతో పాటు కళ్లు కూడా తెరువలేకపోతున్నానని, అయినా దాని గురించి దిగులు లేదన్నారు. విశ్వాసపాత్రులమని చెప్పి కొందరు నమ్మక ద్రోహం చేశారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీకి వ్యతిరేకరంగా మారిన రెబల్స్ డబ్బుల కోసం అమ్మడుపోయారని ఆరోపించారు. తాను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు (గత నవంబర్‌లో) కొందరు శివసేన ఎమ్మెల్యేలు తనకు ద్రోహం చేసేందుకు ప్లాన్ చేశారని ఉద్ధవ్ ఆరోపించారు. షిండే రెబెల్ గ్రూప్‌లో ఉన్నవారిపై తనకు ఎలాంటి పగ లేదన్నారు. వీడిన వారి గురించి ఎందుకు బాధపడాలి అని ప్రశ్నించారు. శివసైనికులు కోరితే అధ్యక్ష పదవి నుంచి తాను దిగిపోతానని పునరుద్ఘాటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more