FIR against MS Dhoni, 7 others in Bihar's Begusarai ధోనిపై ఎఫ్ఐఆర్: బీహార్ లోని పాత కేసులో ఇరుక్కున్న సీఎస్కే కెప్టెన్

Ms dhoni in hot soup after fir filed against him in bihar s begusarai

mahendra singh dhoni, ms dhoni, cheque bounce case, cheque bounce case against dhoni, MS Dhoni, FIR against MS Dhoni, MS Dhoni FIR, CSK, Chennai Super Kings (CSK), Cricket news, sports news, Cricket, sports

Chennai Super Kings (CSK) skipper MS Dhoni has landed in hot soup as an FIR has been filed against him and seven other people in Begusarai’s CJM’s Court. The FIR was filed by SK Enterprises for a bounced cheque of INR 30 lakhs by New Global Produce India Limited. Since MS Dhoni has promoted New Global Produce India Limited, his name was also mentioned in the FIR.

ధోనిపై ఎఫ్ఐఆర్: బీహార్ లోని పాత కేసులో ఇరుక్కున్న సీఎస్కే కెప్టెన్

Posted: 06/01/2022 03:01 PM IST
Ms dhoni in hot soup after fir filed against him in bihar s begusarai

టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోంటున్నాడు. ఓ సంస్థకు ప్రమోటర్ గా వ్యవహరించడమే ఆయనకు కొత్త చిక్కులను తెచ్చింది. అంతేకాదు బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఇదే కారణమయ్యింది. సంస్థకు ప్రమోటర్ గా వ్యవహరించిన కారణంగా ఇలాంటి కేసును ఇప్పటికే ఢిల్లీలో ఎదర్కోన్న ధోని ఇక తాజాగా మరో కేసులోనే ఇరుక్కున్నాడు. బీహార్ లో నమోదైన కేసులో ఆయనపై చెక్ బౌన్స్ కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ లో చేర్చారు బీహార్ పోలీసులు.

ఓ ఎరువుల తయారీ సంస్థకు చెందిన కేసులో ధోని అనవసరంగా ఇరుక్కున్నాడు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ధోని.. టీమిండియా కెప్టెన్‌గా పనిచేసినప్పుడు బీహార్ కు చెందిన న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు ప్రమోటర్ గా ఉన్నాడు. ఇదొక ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేసే సంస్థ. ఎస్కే ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ.. న్యూఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 30 లక్షలు విలువ చేసే ఎరువులు కొనుగోలు చేసింది. న్యూఇండియా సంస్థ వాటిని డెలివరీ కూడా చేసింది. అయితే ఈ ఎరువులలో నాణ్యత లోపంతో కూడకున్నాయని అరోపణలు వచ్చాయి.

డీలర్ ప్రొవైడర్ కు అనుగుణంగా లేదని, వాటిలో చాలా వరకు అమ్ముడుపోలేదని ఎస్కే ఎంటర్ ప్రైజెస్ ఆరోపించింది. ఆ తర్వాత ధోని ప్రమోట్ చేసిన సంస్థ.. ఆ ఎరువులను వాపసు తీసుకుని, రూ. 30 లక్షల చెక్కును ఏజెన్సీకి అందజేసింది. ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో సదరు సంస్థ న్యూఇండియా గ్లోబల్ సంస్థ కు ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరో ఏడుగురికి లీగల్ నోటీస్ పంపింది. తాజాగా వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చారు. ఈ కేసును విన్న బెగుసరాయ్ కంజ్యూమర్స్ కోర్టు.. దీనిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 28న జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  FIR against MS Dhoni  MS Dhoni FIR  CSK  Chennai Super Kings (CSK)  Cricket  sports  

Other Articles