ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలు దేశాలలో ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారి.. భారత్‌లో మాత్రం రెండుదశలకే పరిమితం అయ్యిందని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో కరోనా వాక్సీన్ లు దేశప్రజలందరికీ వేగవంతంగా ఇవ్వడంతో దోహదపడటంతో దానిని నియంత్రించ గలిగామని వైద్యనిపుణులు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో ఐఐటీ అధ్యయనాలు మాత్రం జూన్ నెలలో మళ్లీ కరోనా మూడవ దశ విస్తరించే అవకాశాలు ఉన్నాయిని కూడా స్పష్టం చేశాయి. అయితే తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. ఐఐటీ నిపుణులు చెప్పిందే వాస్తవమా.? అన్న అందోళన సర్వత్రా నెలకొంది.
వివిధ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు.. ఇప్పటికే అటు దక్షిణాఫ్ఱికా, చైనా, యూనైటెడ్ కింగ్ డమ్ లలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఇవన్నీ బిఏ 1, భిఏ 2 సహా పలు వేరియంట్లు. కానీ తాజాగా హైదరాబాద్‌లో ఒమిక్రాన్ బిఏ 4 వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్‌తో కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి. ఇది మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. కరోనా బారినపడిన వారికి, ఇప్పటికే టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది.
అయితే, ఇది ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు కానీ, వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ పేర్కొన్నారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఎ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరిగినా ఉద్ధృతి మాత్రం తక్కువగానే ఉంటుందని అంటున్నారు. బాధితులు ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు దాదాపు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more