వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అత్యున్నత న్యాయస్థానం వాదనలు విననున్నట్టు ప్రకటించింది. జ్ఞానవాపి మసీదులో సర్వే చేస్తుండగా వజు ఖానా (ముస్లింలు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉద్దేశించిన నీటి గుండం)లో శివలింగం బయటపడడం తెలిసిందే. ఇక ఇవాళ విచారణ చేపట్టనున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం అదేశాలతో వారణాసి కోర్టు దానిని నిలిపివేసింది. ఈ నెల 23న విచారణ చేపడతామని తెలిపింది.
కాగా, మసీదులోని వజు ఖానాలో లభించిన శివలింగం రక్షణకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని.. కేసును విచారిస్తున్న వారణాసీ కోర్టు లోగడ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు సైతం ముస్లింలు తమ ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని, అదే సమయంలో వజు ఖానా వద్ద భద్రత కల్పించాలని రెండు రోజుల క్రితం ఆదేశించింది. విచారణ సందర్భంగా ‘‘ఏర్పాట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తున్నామని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. ఈ వ్యాజ్యంలో తదుపరి చర్యలు తీసుకోకుండా నిరోధిస్తున్నామని వెల్లడించింది.
ఈ అంశంపై శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ నిర్వహిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, వారణాసీ కోర్టు నియమించిన ప్రత్యేక కోర్టు కమీషనర్ విశాల్ సింగ్ ఇదివరకే తన నివేదికను అందజేయగా, అంతకుముందే అడ్వకేట్ కమీషనర్ అజయ్ కుమార్ మిశ్రా తన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు - కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాంప్లెక్స్ వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. వజు ఖానాకు వెళ్లే డోర్ వద్ద జవాన్లు మోహరించారు. సీఆర్పీఎఫ్ కమాండెంట్, డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్లు చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more