చిత్ర రంగానికి చెందిన నటీనటులే కాదు సంపన్న కుటుంబాలకు చెందినవారితో పాటు ప్రముఖులు తమ అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. ఇలా సర్జీరీ చేసుకుంటూ అది వికటించి కొందరు మరణించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రముఖ నటి ఆర్తి అగర్వాల్ తిరిగి తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చే క్రమంలో శరీర అకృతి కోసం సర్జరీ చేయించుకుంది. అయితే అది వికటించిన అసుపత్రిలోనే మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలుగు చిత్రరంగంతో పాటు దక్షిణ, బాలీవుడ్ చిత్రపరిశ్రమలను కూడా విషాదంలో నింపింది.
ఇక తాజాగా యువ కన్నడ టీవీ నటి, 21 ఏళ్ల చేతన రాజ్ కూడా ఇలాగే శస్త్రచికిత్స చేయించుకుని ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో శరీర అకృతి కోసం సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఫ్యాట్ ఫ్రీ సర్జరీకి అంగీకారం తెలిపి, మే 16న ఉదయం శస్త్రచికిత్స కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది. సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. సాయంత్రం సమయానికి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం మొదలైంది. ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత విషమించగా, వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేశారు.
అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చేతన తన తల్లిదండ్రులకు చెప్పకుండా.. స్నేహితులతో కలసి ఆమె ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె అకాల మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్ మార్టమ్ కోసం చేతన మృతదేహాన్ని రామయ్య హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులు హాస్పిటల్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. సబ్బు బ్రాండ్లు గీత, దోరెసాని ప్రకటనల్లో నటించిన చేతన కన్నడ ప్రజల్లో ఎక్కువ మందికి పరిచయం.
(And get your daily news straight to your inbox)
Jul 05 | నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న ఏండ వేడిమిని పోయి.. తొలకరి జల్లులతో దేశప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అప్పుడే... Read more
Jul 05 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో ఒక రోజులో గడువు ముగియనుంది. అప్లై చేయనివారు ఉంటే.. అప్లై... Read more
Jul 05 | స్థానబలం అంటే తెలుసుగా.. ఫలానా స్థానంలో ఫలానావారికి బలం అధికంగా ఉంటుందని అర్థం. మరీ ముఖ్యంగా క్రికెట్ లో ఈ పదం చాలా వింటూవుంటాం. ఫలానా మైదనాంలో ఫలానా జట్టుకు బాగా కలసివస్తోంది. వారి... Read more
Jul 05 | భిన్నత్వంలో ఏకత్వం చాటే దేశం మనది. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు.. అనేక ప్రాంతాలు.. ప్రతీ కులానికో ఆచారం. ఒక్కో మతానికి ఒక్కో విధానం. ప్రాంతానికో సంప్రదాయం.. అన్నింటినీ మేళవించినదే భారతీయ సంస్కృతి. అయితే... Read more
Jul 05 | హిజ్రాలను చూస్తేనే కొందరు ఈసడించుకోగా, మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోతారు. ఇక వారు ఎదురుగా వచ్చి డబ్బులు అడిగితే.. లేవని సమాధానం చెప్పి పంపేవారి సంఖ్యే ఎక్కువ. కానీ వారిని కూడా సాధారణ మనుషులు... Read more