British geologist facing death penalty in Iraq బ్రిటీష్ జియాలజిస్టుకు మరణశిక్ష విధించిన ఇరాక్ కోర్టు

Briton accused of artefact smuggling in iraq insists he had no criminal intent

British geologist, Jim Fitton, German tourist, Volker Waldmann, criminal intent, Baghdad court, 12 stones, shards of broken pottery, Eridu, Iraq, Crime

Jim Fitton, 66, and German tourist Volker Waldmann told judges they had not acted with criminal intent as they appeared in a Baghdad court wearing yellow detainees’ uniforms. Father-of-two Fitton collected 12 stones and shards of broken pottery as souvenirs while visiting a site in Eridu, in Iraq’s south east, as part of an organised geology and archaeology tour.

ఇరాక్ చట్టాలు తెలియక మరణశిక్షను ఎదుర్కోంటున్న బ్రిటీష్ జియాలజిస్ట్

Posted: 05/17/2022 01:50 PM IST
Briton accused of artefact smuggling in iraq insists he had no criminal intent

షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. చిన్న చిన్న నేరాలకు కూడా కఠినమైన శిక్షలను వేస్తూ వాటిని బహిరంగంగా అమలుచేయడంతో మిగతావారు అలాంటి నేరాలు చేయాలన్న ఆలోచన కూడా రానీయకూడదనే ఇలా చేస్తారు. ఇటీవలకాలం వరకు ఇస్లామిక్ దేశాలలో మహిళలు కారు నడపడం కూడా నేరంగానే పరిగణించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలం క్రితం ఇక్కడి మహిళలకు కారు నడిపే అవకాశాన్ని సౌధీ ప్రభుత్వం అనుమతించింది.

అయితే ఈ దేశప్రజలకు చట్టాల గురించిన అవగాహన ఉంటుంది. ఇది చట్టం.. అది కాదు అని వారికి తల్లిదండ్రులు, పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ చట్టాల గురించి ఏమాత్రం అవగాహన కూడా లేని విదేశీ పర్యాటకులు ఈ దేశాలకు వెళ్లే మాత్రం ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. ఇతర దేశాల్లో సాధారణ శిక్షలు విధించే నేరాలకు షరియా చట్టం ప్రకారం ఏకంగా మరణశిక్షలు విధిస్తుండటంతో ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. అయితే అక్కడ వారి వాదనలన్నీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగానే మారుతాయి. తాజాగా ఇరాక్ లో ఓ బ్రిటీష్ జాతీయుడు కూడా మరణశిక్షను ఎదుర్కొంటాడు.

అసలింతకీ ఆయన చేసిన నేరం ఏంటీ అన్న వివరాల్లోకి వెళ్తే.. జిమ్ ఫిట్టన్ అనే 66 ఏళ్ల బ్రిటన్ జాతీయుడు.. ఓ రిటైర్డు జియాలజిస్టు. తన కూతురు పెళ్లి పెట్టుకుని ఈలోగా ఇరాక్ పర్యటన చేసివద్దామని భావించాడు. తన స్నేహితుడు, సహచర భూగర్భ శాస్త్ర నిపుణుడు, జర్మనీ దేశానికి చెందిన వోల్కెర్ వాల్డ్ మాన్ తో కలిసి ఆయన ఇరాక్ పర్యటనకు వచ్చారు. ఇరాక్ లోని ఎరిదు ప్రాంతంలో ఉన్న ఓ పురావస్తు ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా తాము ఈ పురావస్తు ప్రాంతం సందర్శించినందుకు గుర్తుగా అక్కడి నుంచి తమకు గుర్తుగా 12 పురాతన రాళ్లను, కొన్ని కుండలు, జాడీలకు చెందిన పెంకులను సేకరించారు. అయితే, అదే వారు చేసిన తప్పయింది.

తమ పురావస్తు సంపదను ఆ పాశ్చాత్యులు అక్రమ రవాణా చేస్తున్నారంటూ బ్రిటన్ జాతీయుడైన జిమ్ ఫిట్టన్ సహా జర్మనీ జాతీయుడైన వోల్కెర్ వాల్డ్ మాన్ లపై..ఇరాక్ అధికారులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ తమ స్వదేశాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో ఇరాక్ నుంచి అమూల్యమైన పురావస్తు సంపదను అక్రమ రవాణా చేస్తున్నారని వీరిని మార్చి 20న బాగ్దాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. పోలీసు నిర్బంధంలో ఉన్న నిందుతులకు ఇచ్చే పసుపు రంగుదుస్తులు వారిరువురు ధరించారు. కాగా, న్యాయస్థానంలో వారిన హాజరుపర్చగా అక్కడి న్యాయస్థాన ధర్మాసనం విచారణ చేసి వారిని దోషులుగా నిర్థారించింది.

దీంతో తాము ఎలాంటి నేరపూరిత ఉద్దేశాలతో ఆ రాళ్లను సేకరించలేదని ఆ జియాలజిస్టులు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానల్ ముందు మొరపెట్టుకున్నారు. తమకు ఇరాకీ చట్టాల గురించి తెలియదని వాపోయారు. ఆ సమయంలో పురావస్తు క్షేత్రం వద్ద తమను హెచ్చరించేందుకు ఎవరూ లేరని, అక్కడ ఎలాంటి సందేశాలతో కూడిన బోర్డులు కూడా లేవని జిమ్ ఫిట్టన్ న్యాయమూర్తికి నివేదించారు. తాను ఓ జియాలజిస్టు కావడం వల్ల ప్రపంచంలో ఏ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించినా, అక్కడి నుంచి కొన్ని వస్తువులు సేకరిస్తుంటానని, అయితే, వాటిని అమ్మాలన్న ఉద్దేశం తనకు ఎప్పుడూలేదని వివరణ ఇచ్చారు. కాగా, ఇరాక్ లో ఈ మాత్రం నేరం మరణశిక్షకు అర్హమైనది కావడంతో జిమ్ ఫిట్టన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.

ఇరాకీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, కుమార్తె పెళ్లిని కూడా చూడలేకపోయాడని అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, జిమ్ ఫిట్టన్ ను విడుదల చేసేలా ఇంగ్లండ్ ప్రభుత్వం చొరవ చూపాలంటూ ఆయన అల్లుడు శామ్ టాస్కర్ ఆన్ లైన్ లో పిటిషన్ ప్రారంభించారు. ఈ పిటిషన్ కు ఇప్పటివరకు 1.24 లక్షల మంది సంతకాల రూపంలో తమ మద్దతు తెలియజేశారు. బాత్ ఎంపీ వెరా హాబ్ హౌస్ ఇంగ్లండ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫిట్టన్ ప్రాణాలను గాలికొదిలేసిందని ఆరోపించారు. అందుకు, ఓ మంత్రి బదులిస్తూ, మరణశిక్ష అంశంపై తమ ఆందోళనలను ఇరాకీ ప్రభుత్వానికి తెలియజేశామని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles