కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా కొత్త వేరియంట్లుగా పరివర్తన చెంది ప్రపంచదేశాలపై దాడి చేస్తూనే వుంది. యావత్ ప్రపంచ మానవాళిపై తీవ్రప్రభావం చూపిన.. ఈ మహమ్మారి తాను పురుడు పోసుకున్న చైనాలోనూ ఇప్పడు మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. చైనాతో పాటుగా పలు దేశాల్లో ఇంకా మరణమృదంగాన్ని మ్రోగిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంది ప్రజలను బలితీసుకుంది. చైనాలో ఒమిక్రాన్ లోని పరివర్తన్ చెందిన వేరియంట్ కొవిడ్ 19 ఎక్స్ఈ విజృంభిస్తుండగా, తాజాగా భారత్ లో మరో కొత్త వేరియంట్ పరివర్తన చెందింది.
ఇటు భారత్ లోనూ కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్లు పరివర్తన చెందిన రకాలు ప్రజలపై విరుచుకుపడుతూనే వున్నాయి. కాగా చైనాలో కరోనా విజృంభించిన నాటి నుంచి భారత్ లోనూ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఐఐటీ కాన్పూర్ కు చెందిన స్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 బయటపడింది. ఇది కరోనా థర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 సబ్ వేరియంట్కంటే పదిరెట్లు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.
‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేము కరోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశాం. 13 శాంపిళ్లను పరీక్షించాం. అందులో ఒకటి బీఏ.12 సబ్ వేరియంట్‌గా గుర్తించాం. మిగతా 12 శాంపిళ్లు బీఏ.2 సబ్ వేరియంట్’ అని మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ నమ్రతా కుమారి వెల్లడించారు. ఇది బీఏ.2కంటే పదిరెట్లు ప్రమాదకరమని తెలిపారు. అయినా, ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీఏ.12 సబ్ వేరియంట్‌ను మొదట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ సబ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more